రాజద్రోహం సెక్షన్‌ను ఆనాడే నిలిపేసిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

న్యూఢిల్లీ స్టూడియో భారత్

Aug 13, 2023 - 10:45
 0  14
రాజద్రోహం సెక్షన్‌ను ఆనాడే నిలిపేసిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

రాజద్రోహం సెక్షన్‌ను ఆనాడే నిలిపేసిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

దిల్లీ

రాజద్రోహం సెక్షన్‌ను భారతీయ శిక్షాస్మృతి నుంచి రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించినా..సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ 15 నెలల కిందటే దాన్ని నిలుపుదల చేశారు..

ఐపీసీలోని సెక్షన్‌ 124ఎ కింద ఎలాంటి కేసులూ నమోదుచేయొద్దని,వలస పాలకులు తెచ్చిన ఆ చట్టాన్ని సమీక్షించాలని ఆయన 2022 మే 11న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేశారు.

''చట్ట సమీక్ష పూర్తయ్యేంతవరకూ రాజద్రోహ నిబంధనలు ప్రయోగించించడం మంచిదికాదు.124ఎ సెక్షన్‌ కింద కొత్త కేసులు నమోదుచేయడంకానీ,విచారణ కొనసాగించడంకానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు. 

ఒకవేళ కొత్తగా ఆ సెక్షన్‌ కింద కేసులు నమోదుచేస్తే దాన్నుంచి విముక్తి కోసం సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చు..

సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అనుసరించి కోర్టులు నిందితులకు ఉపశమనం కల్పించవచ్చు'' అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆరోజు ఉత్తర్వులు జారీచేశారు. 

అలాగే బ్రిటిష్‌ కాలంలో తయారైన చట్టాలను భారతీయీకరించాలని,నేటి పరిస్థితులకు అనుగుణంగా అందులో మార్పులు తేవాలని ప్రధాన న్యాయమూర్తి హోదాలో ప్రతి సభ, సమావేశాల్లో ఆయన చెబుతూ వచ్చారు. 

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఆ దిశలోనే సాగుతున్నాయి.ఇప్పుడు కేంద్రం తెచ్చిన కొత్త బిల్లు ప్రకారం దేశద్రోహానికి పాల్పడితే కేసులు నమోదుచేయడానికి వీలవుతుంది. 

రాజద్రోహానికి పాల్పడితే కేసులు పెట్టడానికి వీల్లేదు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow