జమిలి ఎన్నికలతో సమూల మార్పులు - మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
న్యూఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి
జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల దేశ జీడీపీ 1 శాతం నుంచి 1.5 శాతానికి పెరుగుతుందన్నారు.ఇది ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయమని తెలిపారు.
లోక్‌సభకు,దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి జమిలి ఎన్నికల నిర్వహించాలన్నది.ఏ ఒక్క రాజకీయ పార్టీ అభిప్రాయమో కాదని,దేశ ప్రజలందరి కోరిక అని కోవింద్ చెప్పారు.అయితే ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీల ఆమోదం పొందాలని సూచించారు.జమిలి ఎన్నికల ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది సెప్టెంబరులోనే ఆమోదించిన విషయం తెలిసిందే.దీని ప్రకారం..లోక్‌సభకు,శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతోపాటు ఆ తరువాత 100 రోజుల్లో మున్సిపాలిటీలు,పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
హాట్ న్యూస్ ని చదవండి :- ఏపీ లో ట్రాఫిక్ అమలులో నిర్లక్ష్యం హైకోర్టు - https://studiobharat.com/High-Court-neglects-traffic-enforcement-in-AP
What's Your Reaction?