ఉచిత ఇసుకను తెలంగాణకి తరలిస్తున్న ఆరు తెలంగాణ వాహనాలను పట్టుకున్న యస్.ఐ సూర్య శ్రీనివాస్ 

చిల్లకల్లు స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 12, 2024 - 15:07
 0  103
ఉచిత ఇసుకను తెలంగాణకి తరలిస్తున్న ఆరు తెలంగాణ వాహనాలను పట్టుకున్న యస్.ఐ సూర్య శ్రీనివాస్ 

ఉచిత ఇసుకను తెలంగాణకి తరలిస్తున్న ఆరు తెలంగాణ వాహనాలను పట్టుకున్న యస్.ఐ సూర్య శ్రీనివాస్ 

చిల్లకల్లు 

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామం నేషనల్ హైవే 65 నుండి ప్రభుత్వ ఉచిత ఇసుక తెలంగాణ రాష్ట్రానికి తరలి వెళ్ళుతుందనేది పలువురు నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ ఉచిత ఇసుక తెలంగాణ తరలి వెళ్ళుతుందన్న రోజు వారీ ప్రాచుర్యం జరుగుతుంది.దీనితో చిల్లకల్లు పోలీసు స్టేషన్ యస్.ఐ సూర్య శ్రీనివాస్ వాహనాల తనిఖీలో భాగంగా నేషనల్ హైవే సమీపంలో గల పెట్రోల్ బంకు వద్ద సుమారు ఉదయం 9 గంటల సమయంలో ఒవర్ లోడుతో వస్తున్న తెలంగాణ పేరుతో రిజిస్ట్రేషన్ కాబడిన లారీలను తనిఖీలు చేయగా,వాటిలో ఆరు లారీలలో ప్రభుత్వ ఉచిత ఇసుక వాహనాలను తరలిస్తున్నట్లు గుర్తించడం జరిగిందని ఆయన తెలియజేసారు.

హాట్ న్యూస్ ని చదవండి :- జమిలి ఎన్నికలతో సమూల మార్పులు - మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ - https://studiobharat.com/Radical-changes-with-Jamili-election-Ram-Nath-Kovind

దీనితో వాటిని పట్టుకొని ఉన్నతాధికారుల సమాచారాన్ని అందించారని,వారి ఆదేశాల మేర కేసు నమోదు చేసి,వాటిని సీజ్ చేసిన్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం ప్రభుత్వ ఉచిత ఇసుకను అందించాలనే లక్ష్యాన్ని కొందరు తెలంగాణకి తరలిస్తూ,ప్రభుత్వ పెద్దల పేరు చెప్పుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు ప్రజలు నుండి బలంగా వినిపిస్తున్నాయి.దీనితో ప్రభుత్వ ఉచిత ఇసుకను తెలంగాణ తరలిస్తున్న తెలంగాణ వాహనాలను పట్టుకోవడం పట్ల ప్రభుత్వాని పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇటువంటి వాటిని ప్రోత్సాహించకుండా,ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ,అక్రమ ఉచిత ఇసుకను రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్న ఎంతటి వారినైన ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పలువురు ప్రజలు కోరుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow