భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
జగ్గయ్యపేట :
భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు మోడీ ప్రభుత్వం కుట్రపన్ను తోందని, దేశంలోని సెక్యులర్ పార్టీలన్నీ ఒక్క త్రాటిపై నిలబడి అడ్డుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు.లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు వక్ఫ్ బోర్డుల ఆస్తుల సవరణలు వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఉద్యమాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సభ జరిగింది.ఈ సభకు ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని మతాలు కులాలకు సమన్యాయం కలిగేలా అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.స్వాతంత్రోద్యమపోరాటం లో బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి 23 ఏళ్ల ప్రాయంలోనే ఉరి కంభం ఎక్కిన భగత్ సింగ్,చంద్రశేఖర్ ఆజాద్,అల్లూరి సీతారామరాజు లాంటి ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న మన దేశంలో కులమతాలకు అతీతంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యమైన పండుగలు - https://studiobharat.com/Festivals-in-the-year-of-Sri-Vishwavasu-Nama
రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.స్వాతంత్రోద్యమ పోరాటంలో ఎన్నడూ కనబడని మతోన్మాద పార్టీలు నేడు గద్దెనెక్కి కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా ఉంటున్న ప్రజలమధ్య చిచ్చు పెడుతున్నారని ఇది మోడీ ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు.మోడీ గద్దెనెక్కి 11 సంవత్సరాలు అయినప్పటికీ భారతదేశ ప్రజలకు ఆయన చేసింది ఏమీ లేదని విమర్శించారు.మతోన్మాద పార్టీలను గద్దెదించేంతవరకు కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు చేబడుతుందని ఈ పోరాటాలకు పార్టీలకతీతంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు.పేద మధ్యతరగతి వర్గాల ప్రజల సంక్షేమం కోసం,వారి అభివృద్ధి కోసం కృషి చేస్తామని గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం బడా వ్యాపారస్తులకు ఊడిగం చేసిందే తప్ప నిరుపేదలకు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించ్చారు.అంబానీ,టాటా,అదానీ,ఆదిత్య బిర్లా,భారతీయ టెలికాం లాంటి ఈ ఐదు కంపెనీలకు లక్షల కోట్లు దోచి పెట్టటమే మోడీ విధాన మన్నారు.రైతులకు,మధ్యతరగతి వర్గాలు నిరుపేద ప్రజలకు ఆయన చేసింది ఏమీ లేదన్నారు.భారతదేశ సంపదలో 40% ఈ ఐదుగురు చేతుల్లోనే ఉందన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు ధరలు తగ్గించింది లేదని విమర్శించారు.అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన సీట్లను పంచేందుకు మోడీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని,ఉత్తరాది రాష్ట్రాలలో ప్రజలు ఎక్కువగా ఉండటం బిజెపి పార్టీ బలంగా ఉండటం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో సీట్లను తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం భారీ కుట్రను పన్నిందన్నారు.జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేయటం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో 129 స్థానాలు పెరుగుతాయని,దక్షిణాది నాలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.మోడీ ప్రభుత్వం కుట్రతో ఉత్తరాదిలో సంవత్సరాల తరబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నుతోందని అన్నారు. రాష్ట్రంలోని కోటమి ప్రభుత్వం నాయకులు కూడా మోడీకి ఊడిగం చేస్తున్నారని,ఇది ఎంత మాత్రం మంచిది కాదని అన్నారు సూపర్ సిక్స్ అంటూ గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పేద వర్గాల ప్రజలకు చేసిందేమీ లేదని ఇప్పటికీ చంద్రబాబు పవనులు అబద్ధాలు చెబుతున్నారని దిగబెట్టారు.
నిన్న జరిగిన ఉగాది సమ్మేళనంలో కూడా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాలు ఆడారని పేదరికం పోవాలంటే ధనవంతులు వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పారని ఇది ఎక్కడి న్యాయం అని ప్రశ్నించారు.సంపద సృష్టిస్తానని చెప్పినా చంద్రబాబు అబద్దాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని,పేదరికం పోవాలంటే జనాభాను పెంచుకోవాలని చెప్పడమేమిటిని ప్రశ్నించారు.భారతదేశ జనాభా ఇప్పటికే చైనా ని మించిపోయిందని పేదరికం పోవాలంటే జనాభా పెరగడం కాదని సంపదను సృష్టించాలని ఆయన సూచించారు.ముందుగా బడా వ్యాపారవేత్తలకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి మద్దతు తెలుపకుండా చూడాలన్నారు.ముస్లింలు మన దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారని,కానీ కేంద్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా మంత్రిగా లేరని ఇదెక్కడి సమన్యాయమని ప్రశ్నించారు.భారతదేశానికి ప్రమాదం పొంచి ఉందని ఇప్పటివరకు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాల వారు రాజ్యాంగం ప్రకారం హక్కులు పొందుతున్నారని,వాటిని కాలరాచేందుకు మోడీ ప్రభుత్వం కుట్రపన్ను తోందని రాజ్యాంగాన్ని మారిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు కమ్యూనిస్టు పార్టీలు చేపడుతున్న ఉద్యమాలకు సెక్యులర్ పార్టీలన్నీ ఒక్క తాటి పైకి వచ్చి మద్దతు తెలపాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చినా,వక్ఫ్ బోర్డు సవరణలు చేసినా చూస్తూ ఊరుకోమని,ముస్లింలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.మోడీ గద్దెనెక్కాక క్రైస్తవులపై ముస్లింలపై దాడులు పెరిగాయని ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని సూచించారు.ఏ మతమైనా చెప్పేది ఒకటేనని సబ్ కా మాలిక్ ఎక్ హై దేవుడు ఒక్కటేనని చెప్తుందని దీనిని మోడీ గ్రహించాలని చెప్పారు.ఎన్నో మతాలకు కులాలకు పుట్టినిల్లు అయినా భారతదేశంలో హిందువులని రెచ్చగొడుతూ మైనార్టీలపై దాడులను ప్రోత్సహించటం ఇకనైనా మానుకోవాలని మోడీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసారు.ఆర్ఎస్ఎస్ ని పెంచి పోషిస్తున్న మోడీ ప్రభుత్వం గద్దె దిగేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు.వివేకానంద బోధనలు మనకు స్ఫూర్తిదాయకమని ఈ జ్ఞానాన్ని మోడీకి అమిత్ షాకు కలగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.శాశ్వతంగా అధికారాన్ని ఉంచుకోవాలన్నదే మోడీ ఉద్దేశమని దీనికే డీలిమినేషన్ పేరుతో ఉత్తరాదిలో పార్టీ సీట్లు పెంచేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు.దేహం ముక్కలైనా దేశాన్ని మాత్రం ముక్కలు కానివ్వమని ప్రతిజ్ఞ చేశారు.
మతోన్మాదాన్ని పెంచవద్దని బడా సంపన్నులకు మద్దతు తెలుపవద్దని చిత్తశుద్ధితో ప్రభుత్వాన్ని నడపాలని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు వారి సంక్షేమానికి పలు పథకాలను రూపొందించడానికి కృషి చేయాలే తప్ప వారి మధ్య చిచ్చు పెట్టవద్దని మోడీని హెచ్చరించారు.ముస్లింలు చేస్తున్న ప్రతి పోరాటానికి కమ్యూనిస్టులు అండ ఉంటుందని,లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుతామని,వక్ఫ్ బోర్డు చట్ట సవరణని వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు.జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు,దళిత హక్కుల పోరాట సమితి ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రాయప్ప,గపట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు ఏఐటియుసి కన్వీనర్ పోతుపాక వెంకటేశ్వర్లు,ముస్లిం పెద్ద అబ్దుల్ సమద్ తదితరులు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ అసదుల్లా,ముజీం,నీలకంఠం శివప్రసాద్,కరిసే మధు,భోగ్యం నాగులు,మాశెట్టి రమేష్,మెటికల శ్రీనివాసరావు దళితులు మైనార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సభలో ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు ఆర్.పిచ్చయ్య ఆలపించిన విప్లవ గేయాలు పలువురిని ఆలరించాయి.ముస్లింలకు అండగా మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఆలపించిన విప్లవ గేయాలు సబికుల్ని ఆలోచింపజేశాయి.
What's Your Reaction?






