నేషనల్ హైవే 65 రాష్ట్ర సరిహద్దు బ్రిడ్జి కి మరమ్మతులకు దిక్కేది .... సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు
గరికపాడు స్టూడియో భారత్ ప్రతినిధి
నేషనల్ హైవే 65 రాష్ట్ర సరిహద్దు బ్రిడ్జి కి మరమ్మతులకు దిక్కేది .... సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు
గరికపాడు
జగ్గయ్యపేట మండలం,గరికపాడు గ్రామ రాష్ట్ర సరిహద్దు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవే 65 పై ఉన్న పాలేరు బ్రిడ్జీ ఒక్క వైపు రాష్ట్ర సరిహద్దు ప్రధాన రవాణా రహదారి బ్రిడ్జి అంచులు పాడై నేటికి సుమారు 15 రోజులు దాటుతున్న పట్టించుకునే నాధుడు లేరని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నేషనల్ హైవే 65 మెయింటనెన్స్ కోసం వాహనదారుల వద్ద నుండి టోల్ ఫీజులు వసూలు చేసే శ్రద్ధ టోల్ మేనేజ్మెంట్ వారు ఉండగా, పాడైన బ్రిడ్జీని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించే దాంట్లో ప్రభుత్వ నేషనల్ హైవే అథారిటీ మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చేందారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే గరికపాడు గ్రామ రాష్ట్ర సరిహద్దు వద్ద వరదల కారణంగా పాడైన ఒన్ సైడ్ బ్రిడ్జిని మరమ్మతులు చేయాని టోల్ గేట్ యాజమాన్యానికి టోల్ ఫీజులు వాహనాలకు ప్రయాణించే వారు ఎందుకు చెల్లించాలని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు టోల్ గేట్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ బ్రిడ్జిని మరమ్మతులు చేయలేని వారికి టోల్ ఫీజు వసూలుకు సహకారం అందించే శ్రద్ధ వరదలో పాడైన బ్రిడ్జిని యుద్ధప్రాతిపధికన పునః నిర్మించి,వాహనదారులకు అసౌకర్యం కలిగించకుండా చూడటం లేదని వాహనదారులు వాపోతున్నారు.నేషనల్ హైవే 65 పాలేరు రాష్ట్ర సరిహద్దు బ్రిడ్జి ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతుల చేయించలేకపోవడం పట్ల ప్రభుత్వ తీరును వాహనదారులు పలు ఆక్షేపణలను వ్యక్తం చేస్తున్నారు.
నేషనల్ హైవే 65 బ్రిడ్జిని యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేయని టోల్ గేట్ యాజమాన్యానికి టోల్ ఫీజులు ఎందుకు చెల్లించాలని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైన నేషనల్ హైవే 65 రాష్ట్ర సరిహద్దు పాలేరు రవాణా వన్ వే పై పాడైన పాలేరు బ్రిడ్జీని పునః నిర్మించి వాహనదారులకు అసౌకర్యం కలగకుండా యుద్ధప్రాతిపదికన నిర్మించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపటాలని వాహనదారుల తరుపున సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు ప్రభుత్వాని కోరుతున్నారు.
What's Your Reaction?