సామాన్యులు ఎవ్వరికి ఓటు వేయాలో ఆలోచించుకోవాలి....
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

సామాన్యులు ఎవ్వరికి ఓటు వేయాలో ఆలోచించుకోవాలి....
జగ్గయ్యపేట
ఇప్పటికే అధికార వైయస్ఆర్ పార్టీ నుండి సామినేని ఉదయభాను,ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) మరియు మిగిలిన పార్టీల వారు,స్వతంత్ర అభ్యర్థులుగా జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ ఎన్నికల బరిలో నిలబడబోతున్నారు.యంయల్ఏ గెలుపు దిశగా వారి వారి ప్రచారాలను కొనసాగుతున్నారు.
వారి వారి గెలుపు కోసం ఎవ్వరికి వారు ఇప్పటికే ఓటర్లను బుజ్జగింపులు,తాయిలాలతో ఆకర్షిస్తూ ప్రజలకు మేము బలంగా ఉన్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు.ఓటర్లు మాత్రం ఎవ్వరిని గెలిపిస్తారో ఎన్నికల ఫలితాల తరువాత మాత్రమే అర్థమౌతుంది.
జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంత ఓటర్లందరు ముఖ్యంగా ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయగలరని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎందుకంటే జగ్గయ్యపేట నియోజకవర్గంలో పలు కర్మాగారాలు,ప్రకృతి సిద్ధమైన సహజ వనరులు, ప్రభుత్వ భూములు,దేవాలయానికి సంబంధించిన భూములు ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే.గత యాభై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు జగ్గయ్యపేట నియోజకవర్గ యంఎల్ఏ గా గెలిచిన వారు వాటిని ఏవిధంగా కాపాడుతున్నారో ప్రజలందరికి తెలిసిన విషయమే.
స్థానికంగా ఎన్నో కర్మాగారాలు ఉన్నప్పటికీ స్థానిక యువత ఎందుకు ఇతర ప్రాంతాలకు ఉద్యోగం,ఉపాధి కోసం వలసలు పోతున్నారు.ప్రధాన మురికి వాడలలో ప్రాధమిక పాఠశాలలు దూరం అవ్వటంతో పేద వర్గాల వారికి ఉచిత నిర్బంధ విద్య ఎందుకు దూరం అవుతుంది.ప్రభుత్వ కళాశాలలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు.జనాభా ప్రాతిపదికన మొన్నటి దాకా ఎందుకు ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి ఎందుకు నోచ్చుకోలేదు.
కృష్ణా నది పరివాహక ప్రాంతంగా ఉన్నప్పటికి చివర దాక పంటలకు నీరు అందుతున్నాయా,నీటి ఎద్దడి ఎందుకు వేసవిలో ఎదురుకోవల్సి వస్తుంది.స్వర్ణ,వెండి మయమైన జగ్గయ్యపేటలో ఆ పని చేసే చేతి వృత్తుల వారు ఎక్కువ మంది ఎందుకు ఇతర పనులకు వెళ్ళుతున్నారు.
రవాణా రంగం ఉన్నప్పటికి లోకల్ గా మొన్నటి దాకా రోడ్లు ఎందుకు విస్తరించలేదో,వాహనాలు రోజుల తరబడి లోడింగ్ కోసం ఎందుకు ఎదురుచూస్తున్నారు.ప్రసిద్ద పుణ్య క్షేత్రాలు ఉన్నప్పటికి ఎందుకు ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారటంలేదు.కొండలు,గుట్టలు,అటవీ ప్రాంతంగా ఉన్నప్పటికి రిజర్వు ఫారెస్ట్ ఎందుకు కాలేదు.ఇసుక ఉన్న స్థానిక నిర్మాణం రంగం ఎందుకు కుదేలు అవుతుంది.
రైల్వే ట్రాక్ ఉన్న మన ప్రాంతానికి ప్యాసింజర్ రైళ్లు ఎందుకు తిరగటం లేదు.బస్టాండ్ ఉన్న ఓల్వా లాంటి ఏసీ బస్సులు ఎందుకు మన ప్రాంతంలో ఆగటం లేదు.కుల సంఘాలను సామాజిక,ఆర్థిక అభివృద్ధికి కృషి చేసింది ఏమిటో.కాలుష్యం వల్ల ప్రజల అనారోగ్యాలకు ఎందుకు గురి కావాల్సి వస్తుంది.నాకు తెలిసిన నా దృష్టిలో ఉన్న మేరకు తెలియజేయగలిగాను...జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఇంకేమైన ఉంటే ఆలోచించగలరని మనవి...
జగ్గయ్యపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులారా....
ఓటుకి నోటు కాదు!జగ్గయ్యపేట అభివృద్ధి జరగాలంటే ఆలోచించి మంచి నాయకునికి ఓటు వేసే భాద్యత మనది...మీ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు...
What's Your Reaction?






