చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

విజయవాడ స్టూడియో భారత్ ప్రతినిధి

Sep 16, 2023 - 10:58
 0  25
చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా.

సీఐడీకి కీలక ఆదేశాలు జారీ.

విజయవాడ :

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా పడింది.దీనిని 19కి వాయిదా వేస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్లు తెలిపింది. ఈలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ సందర్భంగా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు.మధ్యంతరబెయిల్‌ పై విచారిస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.అందుకే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఇందులో తన పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసిందని బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.చంద్రబాబు.రాజకీయ కక్షలతోనే దురుద్దేశపూర్వకంగా నన్ను ఈ కేసులోకి లాగారని, సీఎంప్రోద్బలంతో నన్ను ఇరికించారంటూ పిటిషన్‌లో గుర్తుచేశారు.టీడీపీ అధినేత. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.అయితే దీపిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow