గంజాయి రహిత సమాజ లక్ష్యంగా వందరోజుల కార్యాచరణ ప్రణాళిక - స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
గంజాయి రహిత సమాజ లక్ష్యంగా వందరోజుల కార్యాచరణ ప్రణాళిక - స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో
జగ్గయ్యపేట
గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా గంజాయి రహిత జగ్గయ్యపేట లక్ష్యంగా స్పెషల్ ఫోర్స్ మెంట్ బ్యూరో జగ్గయ్యపేట స్టేషన్ వారు రాబోయే 100 రోజులలో వారు చేపట్టబోయే కార్యాచరణను ప్రజలకు వివరిస్తూ ప్రజలకు మరింత జవాబుదారీతనంగా మరియు మరింత చేరువయ్యే దిశలో వినూత్న రీతిలో ప్రజల ముందుకు రావటం జరిగింది.జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మరియు జగ్గయ్యపేట పట్టణంలో వైయస్సార్ సర్కిల్లోను భారీ ఫ్లెక్సీలను మరియు హోర్డింగ్స్ ఏర్పాటు చేసి గంజాయి రహిత జగ్గయ్యపేట కోసం రాబోయే వంద రోజులలో తాము ఏ ఏ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామో ప్రజలకు వినూత్న రీతిలో వివరించే ప్రయత్నం చేశారు. రాబోయే వంద రోజుల్లో వారు తీసుకునే చర్యలను పది పాయింట్లు రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు.
ఈ చర్యలలో ముఖ్యంగా విద్యాసంస్థలలో యాంటీ ట్రక్ కమిటీలు ఏర్పాటు చేయటం, విద్యార్థులకు యువతకు మరియు సమాజంలో అన్ని జన సమూహాలకు గంజాయి వలన కలిగే అనర్ధాలు పట్ల చైతన్య పరచడం, గంజాయిని అమ్మటం సరఫరా చేయటం వంటి నేరాలకు పాల్పడే నేరస్తులపై నిలబెట్టడం వారిపై దాడులను ముమ్మరం చేయటం, పాత నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించడం మరియు వారి సత్ప్రవర్తన కొరకు స్థానిక తహసిల్దార్ కోర్టులో బైండోవర్ చేయటం, గంజాయి నిర్మూలనకు అన్ని ప్రభుత్వ ఏజెన్సీలలో సమన్వయం చేసుకొని ఉత్తమ ఫలితాలను సాధించటం, గంజాయి వ్యసనానికి అలవాటు పడిన వ్యక్తులకు దాని నుండి బయటపడుటకు అవసరమైన సహకారం అందించడం వంటి చర్యలు ఉన్నాయి. అదేవిధంగా గంజాయి సేవించడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను మరియు గంజాయి ను విక్రయించే , సరఫరా చేసే వ్యక్తులకు విధించే శిక్షలను వివరిస్తూ ఫ్లెక్సీలు మరియు హోర్డింగ్స్ సైతం ఏర్పాటు చేయటం జరిగింది.
రాబోయే రోజుల్లో జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో మరిన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఎన్టీఆర్ సర్కిల్ లోనూ మరియు నేషనల్ హైవే మీద మరిన్ని హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. స్థానిక ఆటో సాండ్ లో ఆటోలకు డ్రగ్స్ మరియు గంజాయి గురించి అవగాహన కల్పించే స్టిక్క ర్స్ ను అంటిచడం జరిగింది.ఈ భారీ హోర్డింగ్స్ మరియు ఫ్లెక్సీలు ఏర్పాటు , స్టిక్కర్స్ ప్రజలలో ముఖ్యంగా యువతలో గంజాయి గురించి, దాని యొక్క దుష్ప్రభావాలు గురించి విస్తృతంగా చర్చ జరగడానికి దోహదం చేస్తాయని తద్వారా వారిలో అవగాహన పెంపొందించి ఈ గంజాయి మహమ్మారిని సమాజం నుంచి దూరం చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయని జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. గంజాయి కి సంబంధించిన సమాచారము ఉంటే ప్రజలు ఈ క్రింది నెంబర్ కు 9440902461 తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
What's Your Reaction?