మూతపడ అంగన్వాడీ కేంద్రాలు
చిల్లకల్లు స్టూడియో భారత్ ప్రతినిధి

చిల్లకల్లు
జగ్గయ్యపేట మండలం ఐసిడిఎస్ చిల్లకల్లు ప్రాజెక్టు పరిధిలో గల అంగన్ వాడీ కేంద్రాలు మూతపడాయి.వివరాలలోకి వెళ్ళితే రాష్ట్ర వ్యాప్తంగా జీతాల పెంపు,వర్క్ లోడ్,పలు యాప్ ల వల్ల ఇబ్బందులు , పెండింగ్ అద్దెలు,బిల్లులు పలు డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీల యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు అంగన్ వాడీ కేంద్రాలకు తాళాలు వేసి మూసివేసి చిల్లకల్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు ముందు బైఠాయించారు.దీనితో కేంద్రాలలో పౌష్టికాహారం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే కేంద్రాల నిర్వహణ సంవత్సరానికి మూడు వందల రోజులు వర్కింగ్ డేస్ ఉండాల్సి ఉండగా అది కాస్త తగ్గే పరిస్థితులు లేకపోలేదని తెలుస్తుంది.
సంబందిత యూనియన్ వారు రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా వారి సమస్యలను పరిష్కరించాలని ఇచ్చారని తెలియజేస్తున్నారు.ప్రభుత్వం మాత్రం అంగన్వాడీలను మాత్రం పలకరించే పరిస్థితులలో లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేలా అధికారులు చర్చలు జరిపి పౌష్టికాహార లబ్దిదారులకు ఫీడింగ్ అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.మెటికల శ్రీనివాసరావు
What's Your Reaction?






