రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ
జైపూర్ స్టూడియో భారత్ ప్రతినిధి
రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ..
రాజస్ధాన్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన ఎన్నికలలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఐతే రాజస్థాన్ సీఎంగా ఎవరిని నియమించాలి అనే విషయం లో ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకుని బీజేపీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
రాజస్ధాన్ సీఎంగా ఎవరూ ఊహించిన వ్యక్తిని తెరపైకి తెచ్చి భజన లాల్ శర్మను ప్రకటించింది.
జైపూర్ లో ఈ రోజు జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
సంగనేరు నియోజక వర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచిన బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన లాల్ శర్మ వైపు బీజేపీ పార్టీ మొగ్గు చూపింది. ఈ భజన లాల్ శర్మ ప్రస్తుతం బీజేపీ స్టేట్ జనరల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నాడు..
What's Your Reaction?