రైతులకు కనీస మద్దతు ధర పై ఆర్డినెన్స్ కేంద్రం అంగీకరిస్తుందా?
రైతులతో నాలుగో విడత చర్చలు.... స్టూడియో భారత్ ప్రతినిధి
రైతులకు కనీస మద్దతు ధర కోసం పంజాబ్ రైతులు రోడ్డెక్కి, హరియాణా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద నిరసనకు దిగిన అన్నదాతలు ఈ రోజు (ఆదివారం) కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్నారు.కనీస మద్దతు ధర పై ఆర్డినెన్స్ తీసుకు రావాలని రైతులు అంతకుముందు డిమాండ్ చేశారు.ప్రభుత్వం కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలనుకుంటే వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలి అని రైతుల ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కి చెందిన సర్వణ్ సింగ్ పాందర్ చెప్పారు.
ప్రభుత్వం ఎప్పడునుకుంటే అప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావచ్చు, కానీ ఆ పని ఎందుకు చేయడం లేదు’’ఆర్డినెన్స్ తీసుకువస్తే ఆరునెలల్లోపు దానిని చట్టరూపంలోకి తేవాల్సి ఉంటుంది’’ అని భారతీయ కిసాన్ యూనియన్ (సిద్ధ్‌పూర్) నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చెప్పారు.కేంద్రం ప్రభుత్వానికి,రైతుల మధ్య నాలుగో విడత చర్చల సందర్భంగా ఈ ఆర్డినెన్స్ డిమాండ్ తెర పైకి వచ్చింది.కనీస మద్దతు ధర సహా అనేక సమస్యల పరిష్కారానికి రైతులు దిల్లీ దిశగా నినాదాలతో ప్రదర్శనగా సాగుతున్నారు. ప్రస్తుతం వారిని పంజాబ్, హరియాణా మధ్య శంభు సరిహద్దు వద్ద నిలిపివేశారు.
మళ్లీ డబుల్ సెంచరీ కొట్టిన జైస్వాల్....
https://studiobharat.com/Jaiswal-hit-a-double-century-again ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..
What's Your Reaction?