ఆర్మీ అభ్యర్థులకు చిత్రహింసలు.. స్పందించిన నారా లోకేశ్
శ్రీకాకుళం స్టూడియో భారత్ ప్రతినిధి
ఆర్మీ అభ్యర్థులకు చిత్రహింసలు.. స్పందించిన నారా లోకేశ్ మొదలైన పోలీసుల దర్యాప్తు ఈ వీడియోలో ఘటన 2023 డిసెంబర్ లో జరిగినట్లుగా నిర్దారణ వీడియోలో స్టూడెంట్ ను గుర్తించి అతని వాంగ్మూల0 నమోదుకు బయలుదేరిన ఒక పోలీసులు బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన పోలీసులు
శ్రీకాకుళం :
ఏపీలో ఆర్మీ ట్రైనింగ్ పేరుతో అభ్యర్థులను చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆయన ట్వీట్ చేశారు. నారా లోకేష్ ట్వీట్ చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. శ్రీకాకుళం లోని ఆర్మీ కాలింగ్ సంస్థ డైరెక్టర్ రమణ విద్యార్థులను కరెంట్ వైరుతో చితకబాదారు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ గోల్డెన్ స్క్రీన్ నటీనటులకు అవార్డు ఫంక్షన్ - https://studiobharat.com/https://studiobharat.com/Swati-Art-Creations-Award-Function-for-Golden-Screen-Actors
What's Your Reaction?