ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి మృతి
పుల్లంపేట స్టూడియో భారత్ ప్రతినిధి
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం ముగ్గురి మృతి
పుల్లంపేట:
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.ఆర్టీసీ బస్సు,ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు..
మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పుల్లంపేట సమీపంలోని మలుపు వద్ద జాతీయ రహదారిపై కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ వేగంగా ఢీకొట్టింది.దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.లారీ డ్రైవర్ అతివేగమే ప్రమదానికి కారణమని పోలీసులు,స్థానికులు చెబుతున్నారు.ఈ ప్రమాద ఘటనతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఇది కూడా చదవండి...https://studiobharat.com/A-silent-killer-that-takes-life-in-our-body.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి.
ప్రమాదంలో..ఓబులవారిపల్లె మండలానికి చెందిన గుండాల శ్రీనివాసులు అలియాస్ బుడ్డయ్య (62),రాజంపేట మండలం వెంకట రాజంపేటకు చెందిన శేఖర్ (45),కడపకు చెందిన బాషా (65) మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు.తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..
What's Your Reaction?