ఏసీబీకి చిక్కిన జిల్లా పరిశ్రమల అధికారి

సిరిసిల్ల స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 31, 2023 - 10:17
 0  78
ఏసీబీకి చిక్కిన జిల్లా పరిశ్రమల అధికారి

ఏసీబీకి చిక్కిన జిల్లా పరిశ్రమల అధికారి

సిరిసిల్ల జిల్లా:

అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి చేప సోమవారం మధ్యాహ్నం చిక్కింది.సిరిసిల్లజిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు రూ. 13 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు .

సిరిసిల్ల జిల్లాలోని వీర్ణపెల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన భూక్యా సరిత టిప్పర్ సబ్సిడీ కోసం కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ కు దరఖాస్తు చేసుకోగా, సబ్సిడీ మంజూరీ కోసం సరితకు అనుకూలంగా పంపడానికి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు.

దీనితో మొదటి విడతగా రూ.17వేలు ఈనెల 26న తీసుకోగా, సోమవారం మిగతా 13 వేల రూపాయలను సరిత మరిది భూక్య శివకుమార్ వద్ద నుండి సిరిసిల్ల పట్టణంలోని గీత నగర్ జడ్పీ హై స్కూల్ లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు ను ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ వి.వి రమణమూర్తి తెలిపారు.

ఏ అధికారైన అవినీతికి పాల్పడితే 9154388954 సంప్రదించాలని కోరారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow