సోషల్ మీడియాలో బర్రెలక్క విస్తృత ప్రచారం
కొల్లాపూర్ స్టూడియో భారత్ ప్రతినిధి
సోషల్ మీడియాలో బర్రెలక్క విస్తృత ప్రచారం
నాగర్ కర్నూల్ జిల్లా:
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిరుద్యోగిని బర్రెలక్క,శిరీష రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తోంది.వినూత్న ప్రచారంతో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క అలియాస్ శిరీష పోటీలో నామినేషన్ వేసింది.అయితే తన వద్ద డబ్బు లేదని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ ద్వారానే తన ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె నిరుద్యోగ యువత కోసం తాను పోటీలో ఉన్నట్లు తెలిపారు.
కాగా ఈ ఎన్నికలకు సంబంధించి పాటను ఒకరు సోషల్ మీడియాలో విడుదల చేసింది.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.
ఈ పాట విన్న నెటిజన్లు,నిరుద్యోగులు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు...
What's Your Reaction?