ఏం టాలెంట్ ఒకేసారి గవర్నమెంట్ జాబ్స్ ఐదంటా

కరీంనగర్ స్టూడియో భారత్ ప్రతినిధి

Mar 3, 2024 - 10:41
 0  10
ఏం టాలెంట్ ఒకేసారి గవర్నమెంట్ జాబ్స్ ఐదంటా

కరీంనగర్ జిల్లా ల్యాగలమర్రి గ్రామానికి చెందిన ఓ యువతి సత్తా చాటింది.ఒకటి కాదు,రెండు కాదు,ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.తన ప్రతిభతో ఉద్యోగాలు సాధించి ఔరా అనేలా చేసింది.ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధిచటం ప్రతి ఒక్కరి కల.అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతారు.గంటలకొద్దీ చదివితేగానీ,ఒక్క ఉద్యోగం సాధించలేరు.

గవర్నమెంట్ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా..

వేలల్లో లక్షల్లో పోటీ ఉంటుంది.అటువంటింది ఒకటి కాదు,రెండు కాదు,ఏకంగా5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది ఓ యువతి.కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలంలోని ల్యాగలమర్రి గ్రామానికి చెందిన పుప్పాల భూమయ్య, రమ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.వారి కూతురు మమత సిరిసిల్లలోని గురుకుల డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అతిథి అధ్యపకురాలిగా విధులు నిర్వర్తిస్తూనే,గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగాల పోటీ పరీక్షలు రాసింది.పరీక్షల్లో సత్తా చాటి మున్సిపల్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్,గురుకులాల్లో టీజీటీ,పీజీటీ,జూనియర్ లెక్చరర్‌తో పాటుగా డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలతో మొత్తంగా ఐదు ఉద్యోగాలు సాధించింది.ఉన్నత స్థాయిలో తమ కూతురు నిలవాలి అనుకున్న తల్లిదండ్రులు ఇలా తమ కూతురు ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఓకే ఉద్యోగం సాధించడం గగనం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాసిన అన్నింటిలోనూ సత్తా చాటి ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించింది మమత.ఆమె ప్రతిభ గురించి తెలుసుకొని ఏం టాలెంట్ భయ్యా అని కొనియాడుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow