వక్స్ బోర్డు సవరణలకు మోక్షం

న్యూఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి

Apr 6, 2025 - 07:23
 0  42
వక్స్ బోర్డు సవరణలకు మోక్షం

వక్స్ బోర్డు సవరణలకు మోక్షం

భారత్ లో వివాదాస్పద వక్స్ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించింది.సుధీర్ఘ చర్చలు,వాదనల తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లును బుధవారం దిగువ సభ ఆమోదించగా,ఎగువ సభ గురువారం ఆమోదించింది.బిల్లుకు అనుకూలంగా 128 మంది,వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు.ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి.రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశ పెట్టి చర్చ ప్రారంభించారు.కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. 

అయితే.. వర్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని,ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బ తీసేలా నిబందనలు.ఈ బిల్లులో లేవని కేంద్ర మంత్రి చెప్పారు.సంక్లిష్టతలను తొలగించి,పార దర్శకత తీసుకురావడమే ప్రభుత్వం ఉద్దేశ్యమని అన్నారు.దీంతో పాటు.. వక్స్ ఆస్తులకు సాంకేతికతను ప్రవేశపెట్టి..బోర్డు పనితీరు మెరుగుపరుస్తామని చెప్పారు.అసలు ఈ బిల్లుకు,మతానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు కిరణ్ రిజిజు.2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్స్ ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు నెరవేర్చని లక్ష్యాలను తాము నెరవేర్చడానికే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారాయన.సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పు పై వ్యక్తమవుతున్న అనుమానాలకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు.ముస్లిమేతరులు ఎక్కువమంది ఉంటారనే భయం అవసరం లేదని చెప్పారు.వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి బీజేపీ ఈ బిల్లు తెచ్చిందని ఆరోపించింది.ప్రతిపక్షాలు చేసిన ఏ ఒక్క సిఫార్సును ఈ బిల్లులో ఎందుకు పెట్టలేదని నిలదీసింది కాంగ్రెస్ పార్టీ, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చడమే ఈ బిల్లు ఉద్దేశ్యమని ఆరోపించింది.వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.దేశంలో నెలకొన్న మత సామరస్యాన్ని దెబ్బ తీయవద్దని మల్లిఖార్జున్ ఖర్గే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు.వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్ సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది.

ఆ తర్వాత అక్కడ కూడా ఆమోదం పొందింది. దీంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించినట్టు అయింది.రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లులను ప్రభుత్వం పంపించనుంది. వక్ఫ్ సవరణ బిల్లుపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ముస్లింలను అణగదొక్కడం, వారి వ్యక్తిగత చట్టాలు, అస్తి హక్కులను అక్రమించుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు.ఈ బిల్లు ముస్లింల హక్కులను కాలరాయడానికి వినియోగిస్తున్న ఆయుధంలా ఉందని మండిఎడ్డారు.ఆర్ఎస్ఎస్, బీజేపీ, దాని మిత్రపక్షాలు రాజ్యాంగం పై దాడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే ఇప్పుడు ముస్లింలపై జరుగుతున్న దాడి భవిష్యతులో ఇతర వర్గాలపై కూడా జరగొచ్చని అన్నారాయన. వక్ఫ్ ట్రిబ్యునళ్ల నుండి ముస్లిం చట్టంలో నిపుణుడిని తొలగించడం వల్ల వక్ఫ్ సంబంధిత వివాదాల పరిష్కారంపై ప్రభావం పడవచ్చనే ఆందోళన కూడా ఉంది. అలాగే, ఈ బిల్లు కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాంను ఆచరించే వ్యక్తులకు మాత్రమే వక్ఫ్ ఇచ్చేవిధంగా పరిమితం చేస్తుంది. అలాంటి నిబంధన ఎందుకనేది మాత్రం అస్పష్టంగా ఉంది. ఈ విధానం వల్ల ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాలం ఇస్లాంను ఆచరించే వ్యక్తులకు.. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న వారికి మధ్య వ్యత్యాసా న్ని సృష్టిస్తుందని కొందరు అంటున్నారు. 

ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చెప్పే సమానత్వ హక్కును ఉల్లంఘించే అవకాశం వక్ఫ్ బోర్డ్ వద్ద మొత్తం 8.7 లక్షల స్థిర, చరాస్తులు ఉన్నాయి. వీటిలో 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. దీని మొత్తం విలువ రూ.1.2 లక్షల కోట్లు. అంత భారీ ఆస్తులున్న వక్ఫ్ బోర్డ్ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ చట్టానికి సవరణ తీసుకొస్తోంది. ఈ సవరణ విషయంలో ఇప్పుడు వివాదం నెలకొంది. సవరణ బిల్లు పార్లమెంట్ లో పాసయితే వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు వస్తాయి. ప్రస్తుతం అమలులో ఉన్న వక్ఫ్ చట్టాన్ని 1995లో రూపొందించారు. ఆ తర్వాత ఇప్పుడు సవరణ చేపట్టారు. వక్ఫ్ సవరణ బిల్లు -2024 పార్లమెంట్ ముందు కొచ్చింది.సవరణ బిల్లు పాసయితే ముస్లిం సమాదానికి నష్టం జరుగుతుందని ఆయా సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానాన్ని ఇచ్చే విరాళాన్ని వక్ఫ్ గా పరిగణిస్తారు. వక్ఫ్ అస్తులు భగవంతుడికి చెందుతాయని వారు నమ్ముతారు. ఢిల్లీ సుల్తానులనుంచి వక్ఫ్ సంప్రదాయం మొదలైంది. ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తున్నారు. వక్ఫ్ భూముల్ని.. మసీదులు, మదర్సాలు, షాదీమంజిల్ లు, అనాథ ఆశ్రమాలు, శ్మశాన వాటికలకోసం వినియోగిస్తున్నారు. అయితే వక్ఫ్ అస్తులు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయనేది ప్రధాన ఆరోపణ, వక్ఫ్ బోర్డ్ సమర్థంగా వాటిని నిర్వహిం చలేకపోవడం వల్లే అవి అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వం భావిస్తోంది. 

దీనిపై 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం సుమారు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతంలో ఉన్నాయి. 13వేల ఆస్తులపై కోర్టు కేసులున్నాయి. ఇక 4.35 లక్షల ఆస్తుల గురించి తగిన సమాచారమే లేదు. సో.. ఇంత నష్టం జరుగుతున్నా చూస్తూ ఊరుకోవాలా అనేది ఎన్డీఏ ప్రభుత్వం వేస్తున్న ప్రశ్న, వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించేందుకు కొత్త చట్టం పనికొస్తుందని అంటున్నారు నేతలు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డ్ లు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోని బోర్డులు వక్ఫ్ ఆస్తులని నిర్వహిస్తుం టాయి. అయితే కొత్త చట్టం అమలులోకి వస్తే బోర్డు సభ్యుల నియామకంలో ప్రభుత్వ పాత్ర గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు సెంట్రల్ పర్స్ కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలు ఉండేవారు. ఇకపై ఇద్దరు ముస్లిమేతరులకు సభ్యత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యుల్లో ఇద్దరు ముస్లిం మహిళలు కూడా ఉండాలని ప్రభుత్వం బిల్లులో ప్రతిపాదించింది.ఈ సవరణలను ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 

సన్న బియ్యం పంపిణీ తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు - https://studiobharat.com/Celebrations-across-the-state-with-the-distribution-of-fine-rice

వక్ఫ్ వివాదాలపై ఇప్పటి వరకు వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్చు అంతిమం. కానీ ఇకపై ల ట్రిబ్యునల్లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు.వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను హైకోర్టులో సవాలు చేసే అవకాశం కూడా ఇచ్చారు. కొత్త చట్టంగా అమలులోకి వచ్చాక 6 నెలల లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్ లో విధిగా నమోదు చేయించాలి.ఇక వక్ఫ్ ఆస్తుల విషయంలో జిల్లా కలెక్టర్లకు కూడా అధికారాన్నిస్తోంది కొత్త బిల్లు వక్ఫ్ బోర్డ్ అధీనంలో ఉన్న భూములను సరిగా వినియోగించుకుంటే వాటిపై ప్రతి ఏటా 1.2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనేది సచార్ కమిటీ నివేదిక చెబుతోంది.తాజా సవరణ వల్ల ముస్లిం సమాజానికి భారీ నష్టం తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

అందుకే,ప్రతిపక్షలు తమ వాదనను బలంగా వినిపిస్తున్నాయి.జాతీయస్థాయిలో అన్ని పార్టీలకు షాక్ ఇచ్చింది తెలుగుదేశం.వక్ఫ్ బిల్లు సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసింది టిడిపి,మరోవైపు జెడియు సైతం తెలుగుదేశం పార్టీకి జత కలిసింది.కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి ఆ రెండు పార్టీలపై పెంచిన ఒత్తిడి పనిచేయలేదు.పైగా తాము చేసిన పనికి సమర్థించుకున్నాయి.ఆ రెండు పార్టీలు ఈ బిల్లు సవరణ అనేది ముస్లింలకు ప్రయోజనమే తప్ప నష్టం కాదని కూడా వాదించాయి.దీంతో ముస్లింల్లో ఈ రెండు పార్టీలను దోషిగా నిలబెట్టాలన్న ప్రయత్నం విఫలమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.పైగా తాము ముస్లింలకు ప్రయోజనం చేకూర్చామే తప్ప.. నష్టపరచలేదని వారు రెండు పార్టీల ఎంపీలు లోక్ సభ వేదికగా ప్రకటించారు.ఒక విధంగా చెప్పాలంటే ఈ అంశం ద్వారా ఎన్డీఏ కూటమిలో చీలికలు తేవాలన్న ప్రయత్నాలకు బాగానే చెక్ చెప్పాయి తెలుగుదేశం,జెడియు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow