గరుడ పంచమి కథ

ఆధ్యాత్మికం స్టూడియో భారత్ పత్రినిధి

Jul 29, 2025 - 06:28
 0  69
గరుడ పంచమి కథ

గరుడ పంచమి కథ.....

జూలై 29 మంగళవారం గరుడ పంచమి సందర్భంగా...

గరుత్మంతుడు పక్షులకు రాజు.సర్పజాతికి శత్రువు.ఆయన గొప్పదనమంతా విష్ణుమూర్తిని వాహనరూపుడై సేవించడంలోనే ఉంది.నిరంతర స్వామి పాదసేవా పరాయణుడు గరుడుడు. అపార శక్తికి, అద్భుత గమనానికి సంకేతంగా ఆ పక్షిరాజును దేవతలు భావిస్తారు.వినతా సుతుడైనందున వైనతేయుడయ్యాడు. గరుత్మంతుని అన్న అయిన అనూరుడు సూర్యునికి రథసారథయ్యాడు.రెండో కుమారుడైన గరుడుడు విష్ణుమూర్తికి వాహనమయ్యాడు.

దేవేంద్రుని వజ్రాయుధం దెబ్బలను కూడా తట్టుకోగలిగిన శక్తి గరుత్మంతుని రెక్కలకు ఉంది. అందుకే ఆయనను సుపర్ణుడు అన్నారు. అందువల్లనే దేవేంద్రుని ఓడించి అమృతాన్ని తెచ్చి సవతి తల్లికిచ్చి కన్నతల్లికి దాస్య విముక్తి కలిగించాడు. ఈ విధంగా తల్లికి దాస్య విముక్తి కలిగించిన రోజే శ్రావణ శుద్ధ పంచమి. విష్ణువు పతాకం మీద గరుత్మంతుడు అధిష్ఠించి ఉంటాడు.విష్ణునామాల్లో గరుడధ్వజుడనేది ప్రసిద్ధనామం.

*┈┉┅━❀꧁జై గరుడా꧂❀━┅┉┈*

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow