శబరిమల మాలికపురత్తమ్మ గుడిలో టెంకాయ దొర్లించేది ఎందుకు

స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 12, 2023 - 13:01
 0  65
శబరిమల మాలికపురత్తమ్మ గుడిలో టెంకాయ దొర్లించేది ఎందుకు

శబరిమల మాలికపురత్తమ్మ గుడిలో టెంకాయ దొర్లించి వదిలేయడం ఎందుకు

  • ఇందులోని పరమార్థం ఏమిటి ?

కేరళలోని శబరిమల గురించి తెలియని వారు బహుశా ఉండరు.మండల దీక్షలో ఉండి,ఇరుముడి కట్టుకొని,అందులో నెయ్యి నింపిన ముద్రకాయ,పీచు తీసిన కొబ్బరికాయలు శబరిమలకు అయ్యప్పలు తీసుకవెళ్లటం ఆచారం.

ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగులకొట్టి,అందులోని నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయిస్తారు.గుడిలో కాయను కొట్టరు ఆ కొబ్బరికాయను కాల్చేస్తారు.మరొక కొబ్బరికాయ అమ్మవారి గుడిలో అమ్మ గుడి చుట్టూ దొర్లించి,కొట్టక ఒక మూలకు విడిచి వస్తారు.ఎందుకు?

మాలికాపురత్తమ్మ గుడిలో కొబ్బరి కాయలు దొర్లించుటలో పరమార్తము,ఆధ్యాత్మిక భావన దాగి ఉన్నది.నెయ్యి నింపని కొబ్బరికాయను అనగా మూడు కన్నులు కల నారికేళము లో స్వచ్ఛమైన భగవత్ప్రసాదిత జలము ఉండును.ఈ కాయను పగులకొట్టరాదు.మనలో దాగి ఉన్న 18 భావనలను ఈ కొబ్బరికాయలో ఇమిడ్చి అమ్మవారి సన్నిధిలో వదిలివేయడమే ఈ చర్యలోని భావన.

మాలికాపురత్తమ్మ దేవి సాక్షిగా నా లోని కామ,క్రోధ,లోభ,మోహ,మధ మాత్సర్యాలను సదరు కాయలో భందించి,ఇక్కడే వదిలి పెట్టివెళుతున్నానని,చెప్పి భక్తులు ఇక్కడ టెంకాయను దొర్లించి నిర్గుణులై,పరిశుద్ధులై వెళ్లడం అనేది అంతరార్థం.

నారికేళము ఈశ్వర,విష్ణు సంభంధమైనది.టెంకాయ పై నిలువు చారలు విష్ణు రూపమైతే,కొబ్బరికాయ పై ఉన్న మూడు కన్నులు శివరూపం.

కొబ్బరికాయలోని "అహం" అనే నీటిని తీసి,హరి హరుల కిష్టమైన నెయ్యిని అందులో నింపి,స్వామికి ఆ నెయ్యే నా జీవమని అభిషేకమునకు ఇస్తారు.ఆయన తృప్తితో మన జీవాన్ని తిరిగి ప్రసాద రూపంలో (నెయ్యి) మనకిస్తాడు.పిదప జీవత్సవమైన కాయ (కాయము,అనగా మన శరీరం) ను మంటల్లో వేసి కాలుస్తారు.

శబరి యాత్ర చేసి వచ్చువారు పుణ్యజీవులై,పరిశుద్ద శరీరంతో,లోన దుర్గుణాలన్నియు పోగొట్టుకొని సత్సీలురై పరమ పావన రూపులై వస్తారని అర్థం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow