ఈ దేవాలయంలో చిదంబర రహస్యం తెలుసా

స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 9, 2023 - 08:07
 0  223
ఈ దేవాలయంలో చిదంబర రహస్యం తెలుసా

 చిదంబర రహస్యం

అంతుబట్టని విషయాన్ని చిదంబర రహస్యం అంటారే.. అలా ఎందుకొచ్చింది? చిదంబర ఆలయంలోని అంతుపట్టని రహస్యాలు 

దక్షిణాది ప్రసిద్థమైన శైవ క్షేత్రాలలో చిదంబరం ఒకటి.పరమేశ్వరుడు కొలువై వున్న ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో వున్నది. 

పురణ గాధలననుసరించి శివుడు ‘ఓం’ మంత్రాక్షరంతో చిదంబరంలో కొలువైవున్నట్లు చెప్పబడింది. అందువల్లనే శైవులకు ఈ పుణ్యక్షేత్రం అత్యంత ప్రీతిపాత్రమైంది.

పరమేశ్వరునికి సంబంధించిన ఐదు ప్రసిద్ధ క్షేత్రాలలో చిదంబరం ఒకటి. ఈ ఆలయాన్ని శివుని ఆకాశ క్షేత్రంగా భక్తులు పరిగణిస్తారు. 

తమిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ,అక్కడున్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైనదని మనలో చాలా మందికి తెలుసు.

చిదంబరం లో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధనల అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు.

ఈ విషయాన్ని తన గ్రంధం‘తిరుమందిరం’ లో ప్రసిద్ధ "తమిళ స్కాలర్ తిరుమూలర్ " చెప్పారు.

ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుకభాగంలో ఓ చక్రం ఉంటుంది.దానికి ముందు భాగంలో బంగారం బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి.అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు.అక్కడి పూజారులు.అయితే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తారు.ఈ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం.మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం.ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం.అదే చిదంబర రహస్యమని పండితులు చెబుతారు.

అందుకే ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు అది ఎంతకీ అంతుబట్టకుండా ఉంటే దానిని చిదంబర రహస్యం అంటారు.

ఇపుడు ఈ ఆలయ అద్భుత విశేషాలేంటో తెలుసుకుందాం......

ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. " భూమి, ఆకాశం, వాయువు,నీరు,అగ్ని" ఐదింటిని పంచ భూతాలుగా వ్యవహరిస్తాం.

  • వీటిల్లో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ, 
  • కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ, 
  • కంచిలోని ఏకాంబరేశ్వరుడు భూమికి ప్రతీక అనీ అంటారు.

అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే..ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి.

79 డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి.ఇది ఆశ్చర్యం కదూ! 

చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలున్నాయి.మానవుడికి నవ నాడులు (రంధ్రాలు) ఉంటాయి.

చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు.మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు. 

ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు.మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది.

దేవాలయం లో ”పొన్నాంబళం” కొంచెం ఎడమవైపుకు ఉంటుంది.అది మన హృదయ స్థానం.అక్కడకి వెళ్ళడానికి ‘పంచాక్షర పడి ’ఎక్కాలి.

అది " న + మ + శి + వ + య "పంచాక్షరి ని సూచిస్తుంది.

‘కనక సభ ’ లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు.

పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు –శివారాధనా పద్ధతులు

ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి.64 కళలు ఉన్నాయని రుజువు ఇది. 

అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు.9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు . 

అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు.

పక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్ట్ లు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు.

*సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ ఉత్సవం...ఇది కూడా చదవండి...https://studiobharat.com/Simhadri-Appanna-Giripradakshina-Utsavam

మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.దేవాలయంలో వున్న నాలుగు అందమైన స్తంభాలు ఒక్కోటి ఒక్కో దిక్కులో వుంటాయి.

దేవాలయంలోపలి భాగంలో కళానైపుణ్యం తొణకిసలాడుతుంది.ఈ దేవాలయం నాట్యానికి పుట్టినిల్లుగా గోచరిస్తుంది.

ఇక్కడ వున్న ప్రతి రాయి,స్తంభంపై భరతనాట్య భంగిమలను తెలుపుతుంటాయి.ఎంతో నైపుణ్యంతో పరమేశ్వరుడు ఈ నాట్యాన్ని చేశాడనీ…

అందువల్లనే ఆయనను నటరాజ స్వామిగా కీర్తించారని చెప్పబడింది.

మీకూ ఆ చిదంబర అద్భుతం చూడాలని వుంటే తప్పకుండ తమిళనాడు వెళ్ళిరండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow