బాలింత పట్ల వైద్యుల నిర్లక్ష్యంపై నిలదీత

మంచిర్యాల స్టూడియో భారత్ ప్రతినిధి

Jun 17, 2024 - 06:29
Jun 17, 2024 - 06:42
 0  47
బాలింత పట్ల వైద్యుల నిర్లక్ష్యంపై నిలదీత

బాలింత పట్ల వైద్యుల నిర్లక్ష్యంపై నిలదీత

మంచిర్యాలలోని మాత శిశు సంక్షేమ కేంద్రంలో నెన్నెల మండలానికి చెందిన ఆవునూరి గంగ(25) అనే బాలింత పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించగా ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టగా వారికి పీవోడబ్ల్యూ జిల్లా నాయకురాలు మద్దెల భవాని మద్దతుగా నిలిచి వైద్యుల నిర్లక్ష్యంపై నిలదీశారు.గత వారం రోజుల క్రితం గంగ ప్రసవ నిమిత్తం మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తీసుకురాగా వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించే క్రమంలో ఓ రక్త నాలాన్ని కట్ చేయగా,

గత వారం రోజుల నుండి ఆమెలో చలనం లేకపోగా కుటుంబసభ్యులు ఇదేంటని వైద్యులను ప్రశ్నించగా వారు చేసిన తప్పిదాన్ని గమనించి ఆమెను హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని, బాలింత ప్రాణానికి భరోసా కల్పిస్తేనే అక్కడి నుండి బాలింతను గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్తామని భవాని వైద్యులను డిమాండ్ చేయగా, సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని భాదితురాలి కుటుంబసభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి బాలింతను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow