ఆధార్ కార్డు లేక పాము కాటుకు గురైన బాలిక మృతి

తాండూర్ స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 15, 2024 - 20:33
 0  92
ఆధార్ కార్డు లేక పాము కాటుకు గురైన బాలిక మృతి

ఆధార్ కార్డు లేక పాము కాటుకు గురైన బాలిక మృతి

వికారాబాద్ జిల్లా తాండూర్ 

వికారాబాద్ జిల్లా తాండూర్ పాము కాటుకు గురైన ఓ బాలికకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించే క్రమంలో అంబులెన్స్ సిబ్బందికి ఆధార్ కార్డు ఇవ్వకపోవడంతో ఆ బాలిక మృత్యువాత పడిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అర్ధరాత్రి చోటుచేసుకుంది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

సీఎం నియోజకవర్గం కొడంగల్ ప్రాంతం నందవరం గ్రామానికి చెందిన బుడుగ జంగం సంగీత గత రాత్రి 11 సమయంలో ఇంటి దగ్గర ఆడుకుంటుండగా పాముకాటుకు గురైంది.దీంతో వైద్యం కోసం తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు రెఫర్ చేశారు.దీంతో 108 సిబ్బందికి పాము కాటు గురైన బాలిక ఆధార్ కార్డు వెంట వచ్చిన అమ్మమ్మ ఆధార్ కార్డు ఇవ్వమని అడగగా లేకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది అంబులెన్స్ లో తరలించేందుకు వెనుకడుగు వేశారు.దీంతో రెండు గంటల పాటు బాలికకు ఆక్సిజన్ పెట్టక సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో ఆ బాలిక అక్కడకక్కడే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow