అంగన్వాడీ 7 నెలల అద్దెల పెండింగ్ లు - అద్దె కిచ్చిన యజమానులు ఖాళీ చేయించే యోచన
విజయవాడ స్టూడియో భారత్ ప్రతినిధి
అంగన్వాడీ 7 నెలల అద్దెల పెండింగ్ లు - అద్దె కిచ్చిన యజమానులు ఖాళీ చేయించే యోచన
మహిళల పట్ల చిత్తశుద్ధి ఇద్ధేనా - ఏఐటియుసి గౌరవాధ్యక్షులు జూనెబోయిన శ్రీనివాసరావు
విజయవాడ
అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం జీతాల పెంచే సంగతి దేవుడెరుగునని పెండింగ్ అద్దెల,కూరగాయల,గ్యాస్ బిల్లులు ఎప్పుడు ఇస్తారోనని ఎదురు చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు.దీనితో అంగన్వాడీ కేంద్రాలకు అద్దెకు ఇచ్చిన యజమానులు నేటికి సుమారు 7 నెలలు దాట్టి 8 నెల వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అద్దెలు చెల్లించడం లేదని,ఇలా అయితే ఎలా అని వారు బాదపడుతున్నారు.దీనితో అద్దె యజమానులు రోదన తట్టుకోలేక అంగన్వాడీ నిర్వాహకులు కొంతమంది అప్పులు తెచ్చి పెండింగ్ అద్దెలో కొంత చెల్లించి ఏదో రూపాన వారికి నచ్చ చెప్పుకుంటున్నారని తెలుస్తోంది.ఒక్క పక్క గత ప్రభుత్వం అంగన్వాడీల ఆందోళనలో భాగంగా జూన్ గాని జులైలో జీతాలు పెంచి కుర్చీ దిగిపోయారు.
కాని కుర్చీ ఎక్కిన కొత్త ప్రభుత్వం మహిళలలైన అంగన్వాడీలకు జీతాల పెంచే ఊసేలేదు కాని పెండింగ్ అద్దెలు,కూరగాయలు,గ్యాస్ బిల్లుల పరిస్థితులు సంగతి ఏమిటని ఏఐయుటిసి జగ్గయ్యపేట గౌరవాధ్యక్షులు జూనెబోయిన శ్రీనివాసరావు పత్రిక ముఖంగా తెలియజేశారు.పండుగలు వచ్చి పోతున్న మహిళలను ఎంతో ఉద్దరిస్థున్నామనే చెప్పుకునే కూటమి మహిళలు పని చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వ తీరు ఏమని వర్ణించాలో ప్రభుత్వ పెద్దలకే వదిలి వేయాలని ఆయన అన్నారు.
హాట్ న్యూస్ ని చదవండి :- ఆధార్ కార్డు లేక పాము కాటుకు గురైన బాలిక మృతి - https://studiobharat.com/Aadhaar-card-or-snake-bite-girl-died
ఇప్పటికైన కూటమికి మహిళల పై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ అద్దెలు, కూరగాయలు, గ్యాస్ బిల్లులను వారికి చెల్లించాలని,అంగన్వాడీ జీతాల పెంపు పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి వెంటనే దానిని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాని పత్రికా ముఖంగా కోరారు.
What's Your Reaction?