శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) ప్రోద్బల్యంతో పాలేరు బ్రిడ్జికి కెసిపి వారు మరమ్మతులు
కె అగ్రహారం స్టూడియో భారత్ ప్రతినిధి
శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) ప్రోద్బల్యంతో పాలేరు బ్రిడ్జికి కెసిపి వారు మరమ్మతులు
కె.అగ్రహారం
యన్.టి.ఆర్ జిల్లా,జగ్గయ్యపేట మండలం కె.అగ్రహారం వద్ద గల పాలేరు బ్రిడ్జి ప్రస్తుత వరద తాకిడికి డ్యామేజి అయిన సంగతి అందరికి తెలిసిన విషయమే.దీనితో ప్రజలు,వాహనాల రాకపోకల కోసం స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) ప్రోద్బల్యంతో కెసిపి సిమెంట్ యాజమాన్యం వారు వరద తాకిడికి గురైన బ్రిడ్జిని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.గతంలో ఈ బ్రిడ్జి ని ప్రజల సౌకర్యార్థం ముక్త్యాల రాజా వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ (వి.ఆర్.జి.కె.యం ప్రసాద్) కృషి తో విజయవాడ నుండి జగ్గయ్యపేట మీదుగా కృష్ణ ఒడ్డు గల పరివాహక ఆంధ్ర,తెలంగాణ ప్రాంత ప్రజల రాకపోకల కోసం నిర్మించడం జరిగింది.
అప్పటి నుండి నేటి వరకు బ్రిడ్జి నుండి ఎన్నో దశాబ్దాల పాటు ప్రజలు అటూ ఇటు రాకపోకలు కొనసాగిస్తున్నారు.ఈ బ్రిడ్జీ ఎన్నో విపత్తులను తట్టుకొని నిలబడింది.ప్రస్తుతం ఈ బ్రిడ్జి వరద కారణంగా బలంగా పిలర్స్ గోడలు నిలబడి కొంతమేరకు బ్రిడ్జి మాత్రం డ్యామేజ్ అయినది.నాలుగు రోజుల పాటు వరద ఉధృతి బ్రిడ్జి పై పారడం,వరద తగ్గుముఖం పట్టంగానే కెసిపి సిమెంట్ యాజమాన్యం వారు మరమ్మతులు చేయడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
What's Your Reaction?