జగ్గయ్యపేటలో అధికార ప్రతి పక్ష పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

జగ్గయ్యపేటలో అధికార ప్రతి పక్ష పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది...
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణంలోని బలుసుపాడు రోడ్డు నందు టిట్కో గృహముల పనులను వైకాపా పార్టీ శ్రేణులు పరిశీలించి తిరిగి పట్టణంలోకి వస్తున్నారు.అదే సమయంలో తెలుగుదేశం పార్టీ దళిత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సందర్భంగా పట్టణంలో వీధుల వెంట ర్యాలీగా వెళ్లుతున్న టిడిపి శ్రేణులు ఇరువురు తారాస పడటంతో పార్టీ కార్యకర్తల మధ్య ఒకసారిగా ఎదురుపడటంతో వారి మధ్య ఘర్షణ వాతావరణం సంతరించుకుంది.
దీనితో వెంటనే స్పందించిన పోలీసులు అప్రమత్తమవ్వటం,వైకాపా శ్రేణులు సమన్వయం పాటించడంతో ఘర్షణ వాతావరణం సర్థుమనిగినదనే చెప్పుకోవచ్చు.తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాత మున్సిపాలిటీ ఆఫీసు గోడలను దూకి వెళ్లడం జరిగింది.ఎలక్షన్ సమీపిస్తున్నప్పుడల్లా జగ్గయ్యపేటలో ప్రతిసారీ ఇదే ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది.ఇప్పుడు జరిగిన సంఘటనతో భవిష్యత్తులో జగ్గయ్యపేట ప్రాంతంలో ఏ సమయంలో ఏమవుతుందోనని ప్రజలు భావిస్తున్నారు.
ఇటువంటి వాతావరణం ఎప్పటి నుండో జరుగుతున్నా నిఘా వర్గం,పోలీసులు ముందస్తుగా మేలుకొని ఉంటే బాగుండేదని ప్రజలు భావిస్తున్నారు.ఉద్రిక్తత తరువాత మేలుకొని పోలీసు శాఖ వెంటనే స్పందించి స్పెషల్ పోలీస్ ఫోర్స్ టీంను జగ్గయ్యపేటలో దించి ఘర్షణలు నివారించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
What's Your Reaction?






