ఉపవాసంతో అధిక బరువును తగ్గించుకోవచ్చా
శరీరంలో ఫాస్టింగ్ తో ఏం జరుగుతుంది?

ఈ మధ్యకాలంలో ఉపవాసం అనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట.స్నేహితులు,కుటుంబ సభ్యుల నుంచి ఈ మాట వినిపిస్తూ ఉంటుంది.వీరందరితో పాటు టెలివిజన్ కార్యక్రమాలు,సినిమాల్లో నటించే హీరోహీరోయిన్లు,ఇతర నటీనటులు,సమాజంలో ప్రముఖులుగా గుర్తింపు పొందిన వాళ్లు,సామాన్యులు కూడా తాము ఉపవాసం చేస్తున్నట్లు తరచూ చెబుతుంటారు.వాళ్లు చెప్పే మాటలను బట్టి, ఉపవాసంతో ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించవచ్చు.అయితే,అందులో ఉపవాసం మంచిదేనా?వాస్తవం ఎంత?
ఉపవాసాన్ని ఎలా పాటిస్తున్నారు?
సాధారణంగా ఉపవాసం అంటే కొంత సమయం వరకు తినడం, తాగడానికి పూర్తిగా లేదా పాక్షికంగా దూరంగా ఉండటం,ఆహారానికి పూర్తిగా దూరంగా ఉన్నా క్యాలరీలు లేని ద్రవ పదార్ధాలు తీసుకోవచ్చు.ఉపవాసం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి.దీర్ఘకాలం అంటే మూడు రోజుల వరకు ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు.అలా కాకుండా రోజు మార్చి రోజు కూడా ఉపవాసం చేయవచ్చు.అన్నింటికంటే సులభమైన మార్గం ఏంటంటే ఆహారాన్ని నియంత్రించుకోవడం. ఇందులో మనం రోజూ తిండి తినవచ్చు. అయితే అందుకు కేటాయించే సమయాన్ని తగ్గించుకుంటాం.ఇదెలా అంటే ఉదాహరణకు మనం రోజులోని 24 గంటల్లో ఆహారం తీసుకునే సమయాన్ని పది గంటలకు తగ్గించుకుని 14 గంటల పాటు ఏమీ తినకుండా ఉండవచ్చు. అంటే పది గంటల్లోనే రెండు సార్లు లేదా మూడు సార్లు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.లేకుంటే, ఉపవాసం చెయ్యడంలో కఠినంగా వ్యవహరించాలనుకుంటే ఆహారం తీసుకునే సమయాన్ని 8 గంటలకు పరిమితం చేసి 16 గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి.
ఉపవాసం ఉన్నప్పుడు మెటబాలిజం ఎలా మారుతుంది?
ఉపవాసం చేస్తున్న సమయంలో శరీరంలోని కణాలకు శక్తిని ఇచ్చే ఆహారం అందదు. పోషకాలు ప్రత్యేకించి షుగర్స్ అందవు.శరీరంలోని కణాలు ఈ పరిస్థితికి అలవాటు పడతాయి. దీంతో శక్తి కోసం శరీరంలోని మెటబాలిజం ఇతర మార్గాల్లో శక్తిని గ్రహించేందుకు ప్రయత్నిస్తుంది.అది ఎలా జరుగుతుందంటే- కణాలు తమ పని తీరుని తగ్గించుంటాయి. దీంతో కాలేయం కీటోన్ బాడీస్ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.ఇవి శరీరంలోని కణాలకు శక్తిని అందిస్తాయి.చివరిగా కణజాలంలో నిల్వ ఉన్న కొవ్వు, ఈ సమయంలో విడుదల అవుతుంది.
శరీరంపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఉపవాసం పాటించడం వల్ల శరీరం మొత్తం ప్రభావితం అవుతుంది. మొదటగా,మెదడు పని తీరు,సామర్థ్యం మెరుగుడతాయి.దీనివల్ల ఆలోచనల ఒత్తిడి తగ్గుతుంది.దీనితో పాటు గుండె చక్కగా పని చేస్తుంది.రక్తపోటు తగ్గుతుంది.రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి.పేగుల్లో మంట తగ్గుతుంది.పేగుల్లోని మైక్రో బయోటా పెరుగుతుంది.ఉపవాసం వల్ల వృద్ధాప్యంలో శరీరం మరింత దృఢంగా మారుతుంది.దీనివల్ల ఆకలి బాగా వేస్తుంది.ఇక శరీర బరువు విషయానికొస్తే,ఉపవాసం వల్ల బరువు తగ్గవచ్చు. ఇంకా ముఖ్యంగా శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికి ఇదొక అత్యుత్తమ మార్గం.అయితే ఉపవాసం వల్ల కండరాల పటుత్వం తగ్గుతుంది. అంటే ఫాస్టింగ్ వల్ల మంచితో పాడు చెడు కూడా ఉంది.
సంప్రదాయబద్దమైన ఆహారం మంచిదా? ఉపవాసం మంచిదా?
బరువు తగ్గడం అంత తేలిక్కాదు.మనం రోజువారీగా తీసుకునే ఆహారంలో క్యాలరీలను తగ్గించడం చాలా కష్టం.అలాంటప్పుడు ఉత్తమ ప్రత్యామ్నాయం ఏమిటి?ఈ ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానం చెప్పడం కష్టం.మనుషులంతా ఒకేలా ఉండరు.కొంత మంది రోజూ ఆహారం తినకుండా ఉండలేరు.తినే ఆహారాన్ని తగ్గించుకోవడం లేదా మానుకోవడం వీరి వల్ల కాదు.కొంత మందికి ఉపవాసం పెద్ద కష్టం అనిపించకపోవచ్చు.సంప్రదాయ ఆహారం కంటే ఉపవాసం వల్ల గొప్ప ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రబద్దంగా ఎలాంటి ఆధారాలూ లేవు.ఉపవాసం లేదా ఆహారం తీసుకోవడం అనేది ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వ్యక్తులు,వారి జీవనశైలి,దైనందిన కార్యక్రమాలను బట్టి ఉంటుంది.అయితే నియంత్రిత క్యాలరీలు ఉండే ఆహారం కంటే ఉపవాసం వల్ల మెరుగైన ఆరోగ్య ఫలితాలు వచ్చినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.ఇప్పటికే ఉన్న పద్దతుల విషయానికొస్తే నిర్ణీత సమయంలోనే ఆహారం తీసుకునే ఉపవాసాన్ని ఆచరించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని కొనసాగించినంత కాలం ఈ ప్రయోజనాలు అందుతూనే ఉంటాయి.ఇందులో కూడా మధ్యాహ్నం పూట భోజనం మానేయడం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయి.ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ మానేయడం లేదా ఆలస్యంగా తినడం వల్ల ఎలాంటి లాభం లేదని తేలింది.
ఉపవాసం ఎలా మొదలు పెట్టాలి?
ఉపవాసం చేయడం ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారనేది ముందుగా తేల్చుకోవాలి.ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత న్యూట్రిషనిస్టును సంప్రదించి మీ లక్ష్యాలను వివరిస్తే,వారు అందుకు అనుగుణంగా తగిన ఆహార నియమావళిని సూచిస్తారు.అయితే ఓ విషయంలో చాలా జాగ్రత్త అవసరం.ఉపవాసం చేసే సమయంలో హైపోగ్లైసేమియాతో బాధ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.డయాబెటిస్ ఉన్న వారు ఉపవాసం చేస్తుంటే,వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించుకోవాలి.మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే,ఉపవాసం చెయ్యడాన్ని ప్రారంభించడానికి ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.ఇక చివరిగా,మీరు క్రీడల్లో శిక్షణ తీసుకుంటుంటే,దానికి తగినట్లుగా ఫాస్టింగ్ ప్రొటోకాల్‌ను సమన్వయ పరచుకోవాలి.
What's Your Reaction?






