జిల్లా రిజిస్ట్రార్ శాఖ నుండి పంచాయతీ నిధులు అందక అవస్థలు
స్టూడియో భారత్ ప్రతినిధి

జిల్లా రిజిస్ట్రార్ శాఖ నుండి పంచాయతీ నిధులు అందక అవస్థలు
- అసలే ఎన్నికలు లేకపోవడంతో పంచాయతీకి ప్రజా ప్రతినిధుల లేక ఆర్థిక సంవత్సర ప్రత్యేక నిధులు నిల్
చిల్లకల్లు,షేర్ మహమ్మద్ పేట
జగ్గయ్యపేట మండలం లో చిల్లకల్లు,షేర్ మహమ్మద్ పేట గ్రామ పంచాయతీలు విభజన జరగడంతో సుమారు నాలుగు సంవత్సరాల నుండి ఎన్నికలు లేవు.దీనితో నేటికి సర్పంచ్ మరియు ప్రజా ప్రతినిధులు లేరనే చెప్పుకోవచ్చు.ఇప్పటికి స్పెషల్ ఆఫీసర్ పరిపాలనే సాగుతుంది.దీని మూలానా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రత్యేక నిధులు సైతం గత కొన్ని సంవత్సరాలుగా లెవ్వనే చెప్పుకోవచ్చు.ఇంటి పన్నులే తప్పా ఇతర ప్రభుత్వ ఆదాయాలకు ఈ పంచాయతీలు దూరమైన్నాయనే స్థానిక ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
సందడిలో సడేమియా అన్నట్లు స్థానికంగా భూములు,స్థలాలు రిజిస్ట్రేషన్ కాబడిన చలానాల నగదును సైతం జిల్లా రిజిస్ట్రార్ శాఖ సుమారు 2023 సంవత్సరం నుండి ఈ పంచాయతీలకు ఇవ్వవలసిన లక్షలలో నగదును ఇవ్వడం లేదని తెలుస్తోంది.కనీసం దీని పై సంబంధిత జిల్లా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని ప్రజలు భావిస్తున్నారు.పారిశుద్ధ్య కార్మికులకు సైతం సుమారు ఐదు నుండి ఎన్నిమిది నెలల పాటు జీతాలు ఇవ్వలేదని తెలుస్తోంది.
అసలే ఈ రెండు పంచాయతీలు జగ్గయ్యపేట పట్టణానికి ఆనుకొని హైవే పక్కనే ఉండటం,మేజర్ పంచాయతీలు అవ్వడం,ప్రజా ప్రతినిధులు,ఉన్నతాధికారుల తాకిడి,పలు ప్రభుత్వ పథకాలు మరియు మౌలిక సదుపాయాల అమలు కోసం పంచాయతీలు మెయింటనెన్స్ చేయాలంటే నిర్వహణ అధికారాలకు తలకు మించిన భారంగా మారిందని ప్రజల నుండి వాదనలు వినిపిస్తున్నాయి.కనీసం పంచాయతీల మెయింటెనెన్స్ సైతం అప్పులు తెచ్చి నిర్వహించే దౌర్భాగ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి.
పల్లెలు పట్టణానికి పట్టుకొమ్మలైతే మరి ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు,జిల్లా కలెక్టర్,సంబంధిత జిల్లా అధికారులు ఏమి చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.ఇప్పటికైన ఈ పంచాయతీలకు రావలసిన రిజిస్ట్రేషన్ తాలూకా నిధులను ప్రభుత్వ పెద్దలు ఇప్పించి ఈ పంచాయతీలను ఆదుకోవాలని ప్రజలు,మేధావులు ప్రభుత్వాని కోరుతున్నారు.దీనితో పాటుగా పలు ఆర్థిక సంవత్సరం యొక్క ప్రత్యేక నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసి ఇటువంటి పంచాయతీల అభివృద్ధికి అధికారులు పాటు పడాలని పలువురు ప్రజలు ప్రభుత్వాని కోరుతున్నారు.
What's Your Reaction?






