ఆంధ్ర రాజకీయాలలో వెనుకబడిన వర్గాలకు ఒరింగేదేమిటి - సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు

స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 5, 2023 - 15:00
 0  107
ఆంధ్ర రాజకీయాలలో వెనుకబడిన వర్గాలకు ఒరింగేదేమిటి - సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు

ఆంధ్ర రాజకీయాలలో వెనుకబడిన వర్గాలకు ఒరింగేదేమిటి - సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికార వైకాపా,ప్రతి పక్ష పార్టీలైన తెదేపా,జనసేన,వామపక్షాలు,బిజెపి,కాంగ్రెస్,బియస్పి తదితర పార్టీలు విచిత్రమైని చెప్పుకోవచ్చు.ఎందుకంటే అధికార పార్టీ మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం రాబోయే ఎన్నికల్లో ఏవిధంగానైన అధికారం చేపట్టాలనే ఆలోచిస్తున్నాయనే చెప్పుకోవచ్చు.

గతంలో జాబు రావాలం బాబు పోవాలి అనే నినాదంతో వైకాపా ప్రజలు మన్ననలను చొరకొని అధికార గద్దె నెక్కిన సంగతి అందరికి తెలిసిన విషయమే.

ప్రస్తుతం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ వైకాపా మాత్రం మరలా అధికార పగ్గాలు చేపట్టానికి పేదవారికి పెత్తందారులకు జరుగుతున్న ధర్మ యుద్ధం అనే నినాదాన్ని,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మాత్రం సైకో పోవాలి బాబు రావాలని నినాదంతో ప్రజల ముందుకు వస్తుంది.

ఆంధ్ర లో రాజకీయంలో కులాల కుమ్ములాట 

ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెడ్డి,కమ్మ రాజకీయలు అధికారం కోసం పోటీ పడుతుండగా,మేము కూడా తక్కువేమి కాదనటుగా కాపు సామాజిక వర్గం కూడా ముందు వరుసలోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు.

అధికార,ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద ఇప్పటికే కేసులున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ని మా వల్లే అభివృద్ధి జరుగుతుందని నాయకులు ఉపన్యాసాలలో తెలియజేస్తున్నారు.

ఏదైన రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే సేవా భావం కలిగిన స్వచ్చమైన రాజకీయ వ్యవస్థలు కావాలని అందరికీ తెలిసిందే.

నాయకులు రైతు కూలీలకు వచ్చే కూలీని మాత్రమే తీసుకుంటే ఎలా ఉంటుంది 

కాని అధికార,ప్రతి పక్ష పార్టీల నేతలు మాత్రం వారికి వచ్చే వాటిని మాత్రం వద్దులుకోవడం లేదనేది ప్రజలలో నానుడి.ఒక్క నేత గ్రామాలలో రైతు కూలీలకు రోజు వారీ వస్తున్న కూలీ అమ్మౌంట్ ను నాయకులు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే కొంత మేర రాష్ట్ర ఖజానా అప్పుల నుండి బయట పడే అవకాశం లేకపోలేదని మేధావులు భావిస్తున్నారు.

ప్రస్తుత రాజకీయాలు ఖరీదు అయిందనే భావన అందరిలో ఉంది.ఎంతమంది నాయకులు ఓటుకు డబ్బులు పంపిణీ చేసిన ఆయా ప్రాంతాలలో ప్రజలు ఇష్టపడిన నాయకుడు ఒక్కడు మాత్రమే గెలుస్తున్నారని తెలిసిన నగ్న సత్యం.

దీనితో ఎన్నికలలో నాయకులు ఖర్చు పెట్టి గెలవడంతో ఆయా నియోజకవర్గాల్లో దొడ్డి దారిలో ఏవిధంగానైన సహజ సంపదలను దోచుకొనే ప్రయత్నాలే నాయకులు చేస్తున్నారని ప్రజల నుండి బలంగా వినిపిస్తోంది.దీనితో డబ్బులు సంపాదన కోసం విలువలను పక్కన బెట్టి అటు సెకండ్ క్యాడర్ నాయకులు అధికార పార్టీలోకి కప్పగంతలు వేయడం తో అసలైన వారు ఇబ్బందులకు గురవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజకీయ వ్యవస్థల వల్ల పెరుగుతున్న ధరలు

రాజకీయ వ్యవస్థలు మాత్రం మెజారిటీ ప్రజల ఆర్థిక వ్యవస్థ తగ్గడంతో సామాన్యుడు కొనుగోలు శక్తిని కోల్పోయిన ఈ తరుణంలో సరుకుల రవాణా చేస్తున్న డీజిల్ పెట్రోలు ధరలు ఇతర రాష్ట్రాల కన్న ఎక్కువగా విభజన తరువాత అప్పటి నాయకులు పెంచడం జరిగింది.దేశంలో,రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యుల జీవన స్థితిగతులు మారిపోయమతున్నాయి.

ఇవేవి పట్టించుకోని నాయకులు రాష్ట్ర ప్రజలను రాబోయే ఎన్నికలలో ఓటును ఏవిధంగా కొనుగోలు చేసి, మెజారిటీ కులాలను విచ్చిన్నం చేసే ప్రయత్నాలు చేస్తూ అధికారం చేపట్టే ఆలోచనలలో ఉన్నారే తప్పా ప్రజల జీవన ఆర్థిక ప్రమాణాలను పెంచాలనే ఆలోచనలను నాయకులు గాలికి వదిలివేసారు.

రాష్ట్ర అభివృద్ధికి ఎలక్షన్స్ లో ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ లోని ప్రజలకు ఎంత మేర ఇప్పటి వరకు అధికారం చేపట్టిన పార్టీలు ఏమి చేసాయో,గెలవకు ముందు గెలిచిన తరువాత నాయకులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రజలకు ఆయా పార్టీల వారు మరియు నియోజకవర్గ స్థాయి వరకు శ్వేత పత్రం విడుదల చేయాలని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు ప్రజ తరుపున కోరుతున్నారు.

రాబోయే ఎన్నికలలో స్వచ్చమైన రాజకీయం కోసం నాయకులు ప్రజలకు నగదు ఆశ చూపించకుండా,నాయకులు సేవా భావంతో పని చేసే నాయకులకు మాత్రమే ఓటు వేయాలని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు ప్రజలకు తెలియజేస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow