స్వాతంత్ర్య దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా
స్టూడియో భారత్ ప్రతినిధి
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా
1947 ఆగస్టు 15 న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.దీనిని పురస్కరించుకొని 2023 సంవత్సరంన 76 పూర్తి చేసుకొని 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారతదేశంలో ప్రజలు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా చరిత్రలో జరిగిన కొన్ని కీలక ఘట్టాల గురించి తెలుసుకుందామా మరి.
1947 ఆగస్టు 15 నుండి భారతీయులందరికి ప్రత్యేకమైన దినం.స్వతంత్ర్య భారతదేశం మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి ఎర్ర కోట పై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సంప్రదాయాని భారతదేశం లో నేటికి కొనసాగుతూనే ఉంది.
భారతదేశం స్వాతంత్య్ర దినోత్సవ హిస్టరీ:
ఆంగ్లేయులు భారత దేశానికి ఆధిపత్య హోదా ఇవ్వాలని కోరుకున్నారు.మొహమ్మద్ అలీ జిన్నా,జవహర్ లాల్ నెహ్రూ,మహాత్మా గాంధీ,తేజ్ బహదూర్ ప్రాతి నిధ్యం వహించిన భారతీయుల సమూహం సంపూర్ణ స్వాతంత్ర్యం కోరింది.
1929లో లార్డ్ ఇర్విన్, భారత ప్రతినిధి బృందం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. భారత జాతీయ తన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిసెంబర్‌లో నిర్వహించింది. అదే విధంగా ఆ సంవత్సరం జరిగిన లాహోర్ సెషన్‌లో మునుపటి ఆధిపత్యానికి దూరంగా సంపూర్ణ స్వాతంత్య్రం కోసం 'పూర్ణ స్వరాజ్' తీర్మానాన్ని ఆమోదించారు.
1929 సంవత్సరం డిసెంబర్ 29న లాహోర్ లోని రావి నది ఒడ్డున నెహ్రూ జాతీయ జెండాను ఆవిష్కరించారు.దేశ స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పెద్ద ముందడుగు వేయబోతోందని అన్నారు.జనవరి 26, 1930 సంవత్సరాని భారతదేశ మొదటి 'స్వాతంత్య్ర దినోత్సవం'గా ఎంపిక చేశారు.
ఆనాటి నుంచి1947 వరకు భారతదేశం యేటా జనవరి 26న స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకున్నారు.1950 సంవత్సరంలో ఈ తేదీన భారతదేశం రాజ్యాంగాన్ని ఆమోదించి గణతంత్ర రాజ్యంగా అవతరించింది.ఈ రోజు మనం ఈ తేది ని గణ తంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే))గా జరుపుకుంటున్నాము.
ఆగస్టు 15ని భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాము? :
భారతీయులు సంవత్సరాల తరబడి పోరాటం తరువాత దీనితో బ్రిటిష్ వారిని దేశాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది.1948 జూన్ 30నాటికి భారతదేశానికి అధికారాన్ని బదిలీ చేయాలని బ్రిటిష్ పార్లమెంటు భారతదేశపు చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ ను ఆదేశించింది.
భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యాన్ని చేసారు.రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మౌంట్ బాటన్...ఆగస్టు 15ని భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవంగా ఎంచుకున్నాము. ఈ విషయాన్ని ఆయన తన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పుస్తకంలో రాశారు.
ఆగస్టు 6, 9 తేదీలలో వరుసగా హిరోషిమా, నాగసాకి పై అణు బాంబు దాడులు జరిగి ఆ నగరాలు నేలమట్టమయ్యాయి.ఆ విధంగా జపాన్ చక్రవర్తి హిరోహిటో 1945 సంవత్సరం ఆగస్టు 15 యుద్ధంలో తన దేశం లొంగిపోతున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయం మౌంట్ బాటన్ తీసుకున్న తర్వాత బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ 1947 జూలై 4 న భారత స్వాతంత్ర్య బిల్లును ఆమోదించింది.భారతదేశం, పాకిస్తాన్‌ల రెండు వేర్వేరు ఆధి పత్యాలను అప్పుడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఆగస్ట్ 14 అర్ధరాత్రి, రెండు దేశాధినేతలకు వారి విడుదల పత్రాలను అందించారు.
పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 14న ఎందుకు జరుపుకుంటుంది? : భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం, భారతదేశం, పాకిస్తాన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోవాలి. పాకిస్తాన్ విడుదల చేసిన మొదటి స్టాంపులో కూడా ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవంగా ఉంది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, జిన్నా మాట్లాడుతూ, "ఆగస్టు 15 స్వతంత్ర, సార్వభౌమ పాకిస్తాన్ పుట్టినరోజు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా గొప్ప త్యాగాలు చేసిన ముస్లిం దేశం యొక్క త్యాగాన్ని సూచిస్తుంది." అని అన్నారు.
జూలై 1948లో,పాకిస్తాన్ తన మొదటి స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది,1947 ఆగస్టు 15ని స్వాతంత్ర్య దినోత్సవంగా గుర్తించింది.అయితే ఆ తర్వాత తేదీని ఆగస్టు 14కి మార్చారు. ఈ మార్పుకు కారణాలు స్పష్టంగా లేవు.అర్ధరాత్రి స్వాతంత్య్రం రావడంతో ఆ సమయాన్ని బట్టీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు.
What's Your Reaction?