ప్రజలకే కాదు ఆహార కల్తీ వెంకన్న స్వామి వారి చెంతకి చేరింది...

స్టూడియో భారత్ ప్రతినిధి

Sep 20, 2024 - 10:30
 0  255
ప్రజలకే కాదు ఆహార కల్తీ వెంకన్న స్వామి వారి చెంతకి చేరింది...

ప్రజలకే కాదు ఆహార కల్తీ వెంకన్న స్వామి వారి చెంతకి చేరింది...

ప్రతి మనిషి మనుగడ వంద సంవత్సరాల ఆయు ప్రమాణమే అన్న విషయాన్ని ఈ కలియుగంలో మానవుడు మరిచిపోతున్నాడు.దీనితో మనిషి వెంట రాని ఆస్తిపాస్తుల సంపాదన కోసం మనిషి దొడ్డి దారి ఎత్తుకుంటున్నారు.ప్రజా సేవ (మానవ), మాధవుని సేవ చేయడానికే ప్రజాస్వామ్యంలో నాయకులు సేవకులుగా ఉండాల్సింది పోయి,స్వార్థం పెరిగి స్వచ్ఛమైన గాలి,నీరు,ఆహారాలను సైతం కలుషితం చేయడమే కాకుండా ప్రమాదకర కల్తీలను సమాజంలో చేస్తున్నారు.ఇటువంటి కల్తీలు, కలుషితం వల్ల వంద సంవత్సరాల జీవితాన్ని సైతం అరవై, ఎనభై సంవత్సరాల వయస్సు మధ్యలోనే జీవితాలను ప్రతి మనిషి ముగింపు చేసుకోవాల్సి వస్తుంది.మనిషి ఆరోగ్యకర మనుగడ కోసం ప్రస్తుత ప్రజాస్వామ్యంలో కాలుష్యం నియంత్రణ,ఫుడ్ సేఫ్టీ పేరుతో ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేసియుండటం జరిగింది.

ఈ శాఖలలో రాష్ట్రానికి సరిపడ యంత్రాంగం ఉన్నారా!లేదా! అనేది ప్రభుత్వాని పాలించే వారే ప్రజలకు బహిరంగంగా చెప్పగలుగితే బాగుంటుందేమో.అసలు రాష్ట్రంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ శాఖలలో పని చేసే వారు గాలి,నీరు,ఆహార పదార్థాలను స్వచ్ఛతని ప్రజలకు అందించడానికి ఎంత కృషి చేస్తున్నారో ప్రజలు గమనిస్తూన్నే ఉన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాలన కోసం సేవకులుగా ఉండాల్సింది పోయి నాయకులమనే ధీమాలు పెరగడంతో కాలుష్యం,కలుషితం అవ్వడంతో పర్యావరణం నాశనం అవడమే కాకుండా,మనిషి,పశుపక్ష్యాదుల మనుగడ కోసం ఆహారం సైతం కల్తీలు స్వార్థంతో కొందరు మానవులు చేయడం వల్ల వాతావరణం,ఆరోగ్యాలు అదుపు తప్పిందనే చెప్పుకోవచ్చు.దీనితో యుగాల నుంచి ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల శ్రీహరి వెంకన్న స్వామి వారికి స్వచ్ఛమైన నైవేద్యాని సైతం కల్తీ చేయడం అంటే మనిషి ఎంత స్వార్థానికి ఒడి కడుతున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవ్వాలి.

ఈ పాపం ఎవ్వరిది..... ఇప్పటికైన తిరుమల వెంకన్న స్వామి వారికి స్వచ్ఛమైన నైవేద్యాన్ని అందించాలి.వీరితో పాటు ప్రజలకు నాయకులని చెప్పుకొనే సేవకులు స్వచ్ఛమైన గాలి,నీరు,ఆహారాని అందించే చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు వెంకన్న స్వామి సాక్షిగా ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నారు.మెటికల శ్రీనివాసరావు 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow