హైదరాబాదుకు నలుమూలల మెట్రో సేవలు విస్తరిస్తాం - సీఎం కేసీఆర్

హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 15, 2023 - 17:43
 0  28
హైదరాబాదుకు నలుమూలల మెట్రో సేవలు విస్తరిస్తాం - సీఎం కేసీఆర్

హైదరాబాదుకు నలుమూలల మెట్రో సేవలు విస్తరిస్తాం-సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ న‌లుమూల‌ల‌కు మెట్రోను విస్త‌రించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌చ్చే మూడు,నాలుగేండ్ల‌లో ఈ ప‌నులు పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని సీఎం పేర్కొన్నారు.

గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగురవేసిన అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు.

విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి,సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ 67 వేల 149 కోట్ల వ్యయంతో వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ధి ప‌థ‌కం ఎస్ఆర్‌డీపీ అమలు చేస్తున్నద‌ని కేసీఆర్ తెలిపారు.

ఎస్ఆర్‌డీపీ కింద 42 కీలక రహదారులు,ఫ్లై ఓవర్లు,అండర్ పాస్‌లు,ఆర్వోబీల అభివృద్ధిని చేపట్టింది.వీటిలో చాలాభాగం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.రూ 275 కోట్లతో 22 లింక్ రోడ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం పూర్తిచేసింది.పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరం నలువైపులకూ మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం రూ 69 వేల కోట్లకు పైగా వ్యయపరచి ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న అన్ని జంక్షన్ల నుంచి పైదరాబాద్‌ను అనుసంధానం చేస్తూ,నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకొనే విధంగా మెట్రో రైలును విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది.వచ్చే మూడు,నాలుగేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యం నిర్దేశించింది.కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్‌లో 415 కిలోమీటర్లకు మెట్రో సౌకర్యం విస్తరిస్తుంద‌ని కేసీఆర్ తెలిపారు...!!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow