ప్రభుత్వ సబ్సిడి సోలార్ విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి - డిప్యూటీ కలెక్టర్ ఉమామహేశ్వరరావు
చిల్లకల్లు స్టూడియో భారత్ ప్రతినిధి

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ప్రోగ్రాంని ప్రజలందరు ఉపయోగించుకోవాలని ప్రదర్శన
ప్రభుత్వ సబ్సిడి సోలార్ విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి - డిప్యూటీ కలెక్టర్ ఉమామహేశ్వరరావు
చిల్లకల్లు
యన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామం ప్రధాన వీధులల్లో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ప్రోగ్రాం క్రింద రాయితీతో మీ ఇంటి పై సోలార్ రూట్ టాప్ నిర్మించుకోండి విద్యుత్ బిల్లులను తగ్గించుకోండి అంటూ ప్రజలకు అవగాహన ప్రదర్శనని నిర్వహించారు.అనంతరం ఇన్ స్టలేషన్ గృహాలను అధికారులు సందర్శించారు.సోలార్ వినియోగదారుల నుండి అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ప్రోగ్రాం జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి డిప్యూటీ కలెక్టర్ ఉమామహేశ్వరరావు,జగ్గయ్యపేట మండలం ఇన్చార్జి డోమా పిడి ఏ రాము గార్లు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం ప్రజలకి ఇస్తున్న సబ్సిడీని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని కరెంట్ వినియోగాని తగ్గించుకొని,పర్యావరణాని కాపాడుకొని ప్రభుత్వ సబ్సిడీతో సోలార్ ప్లేట్లను గృహాలపై ఏర్పాటు చేసుకొని కరెంట్ ఛార్జీలను తగ్గించుకోవాలని వారు తెలియజేశారు.ఈ సందర్భంగా చిల్లకల్లు రామస్వామి రాజా నగర్ లో సోలార్ పవర్ ని ఏర్పాటు చేసుకున్న వినియోగదారులను అధికారులు ఫీడ్ బ్యాక్ ని అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ పి మనోహర్,మండల పరిషత్ అధికారి జి నితిన్,ఏపియం యన్ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి బి శివాజీ, ఏయస్ఐ డి మంగ్యనాయక్, ఎలక్ట్రికల్ ఏఇ కె రమేష్ బాబు,లైన్ మెన్ యం సతీష్,మాజీ సర్పంచ్ కారుపాటి డేవిడ్, టిడిపి నాయకులు పసుమర్తి మహేష్,మాతంగి కిరణ్,ద్రోణాదుల కోటేశ్వరరావు మరియు పంచాయితీ, వెలుగు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






