అక్రమ మద్యం తరలింపు వాహనం,బ్యాంకు ఎంప్లాయి పట్టుబడి
గరికపాడు స్టూడియో భారత్ ప్రతినిధి
అక్రమ మద్యం తరలింపు వాహనం,బ్యాంకు ఎంప్లాయి పట్టుబడి
కారు సీజ్,బ్యాంకు ఎంప్లాయి అరెస్టు
గరికపాడు
జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద రాత్రి తెలంగాణ నుండి అక్రమ మద్యం రవాణాని నివారించడంలో భాగంగా టాప్ కల్ ఇండియన్ విస్కీ 12 ఫుల్ బాటిల్స్ లను టియస్ 08 జెపి 0207 మారుతి బ్రిజా కారు వాహనం నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు మరియు గరికపాడు చెక్ పోస్ట్ సిఐ డివి శ్రీహరి ఆదేశానుసారంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు.ఈ వాహనం హైదరాబాద్,కుక్కట్ పల్లి కి చెందిన ఒక్క బ్యాంకు ఎంప్లాయి ది గా గరికపాడు చెక్ పోస్ట్ సిఐ డివి శ్రీహరి తెలియజేశారు.
పట్టుబడిన వాహనాన్ని ,బాటిల్స్ ని,వ్యక్తి ని జగ్గయ్యపేట పట్టణం తొర్రగుంట పాలెంలో గల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ కి తరలించడం జరిగింది.వాహనంలో దొరికిన టాప్ కల్ ఇండియన్ విస్కీ 12 ఫుల్ బాటిల్స్ ను,వాహనాన్ని మరియు అక్రమ తరలింపు కి కారుకుడైన వాహనదారుని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చెక్ పోస్ట్ ఇన్ ఛార్జ్ యస్.ఐ యం రాంప్రసాద్,హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు లు డ్యూటీ లో ఉన్నారు.
What's Your Reaction?