సమాచార హక్కు చట్టం మొత్తం మూడు దశలు
స్టూడియో భారత్ ప్రతినిధి

సామాన్యుడి నిత్య జీవితం లో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు ఒక గొప్ప ఆయుధం,కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సమాచార హక్కు చట్టం-2005
సమాచార హక్కు చట్టం ( RTI ACT-2005 ) దరఖాస్తు ఎలా చేయాలి?
సమాచార హక్కు చట్టం మొత్తం మూడు దశలు గా ఉంటుంది.....
ఉదాహరణ కి పంచాయతీరాజ్ శాఖకి దరఖాస్తు పెట్టాలనుకుంటే...
- మొదటి దశ :-
గ్రామ పంచాయతీ లో పంచాయతీ సెక్రటరీ కి సెక్షన్ 6(1) ద్వారా మీకు కావలసిన సమాచారం కోసం దరఖాస్తు చేయాలి.(ఉదా: పంచాయతీ కి వచ్చిన నిధులు,చేస్తున్న అభివృద్ధి పనులు,సంక్షేమ పధకాలు,లబ్దిదారుల వివరాలు మాత్రమే కాకుండా మరియు అన్ని ప్రభుత్వ కార్యాలయలలో సమాచారం తెలుసుకోవచ్చు).
- ఫీజు వివరాలు :-
తెల్ల రేషన్ కార్డు వారికి దరఖాస్తు రుసుము లేదు,మిగతా వారికి గ్రామ స్థాయి లో ఉచితం,మండల స్థాయి లో 5 రూపాయలు,జిల్లా స్థాయి లో 10 రూపాయలు IPO లేదా కోర్ట్ ఫీ స్టాంప్ దరఖాస్తుతో పాటు జత చేయవలెను.దరఖాస్తు రిజిస్టర్ పోస్ట్ చేయవలెను 30 రోజులు లో మీరు అడిగిన సమాచారం మీ ఇంటికి వస్తుంది.
- రెండవ దశ :
30 రోజులులో సమాచారం రాకపోయినా,లేదా సగం సమాచారం లేదా తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ శాఖ లో పంచాయతీ సెక్రటరీకి సీనియర్ అధికారి అయిన ఎంపీడీఓ కార్యాలయం కు సెక్షన్ 19(1) ద్వారా మొదటి అప్పీల్ చేయవలెను.
- మూడవ దశ :
ఎంపీడీఓ కార్యాలయం నుండి సమాచారం రాకపోయినా,ఒక వేళ సగం సమాచారం వచ్చిన,వచ్చిన సమాచారంతో మీరు సంతృప్తి చెందకపోయిన సెక్షన్ 19(3) ద్వారా RTI కమీషన్ కి దరఖాస్తు చేయవలెను.కమీషన్ ఆ అధికారులను కమీషన్ కార్యాలయంకు పిలిపించి విచారించి మీకు న్యాయం చేస్తుంది.
రండి కదలి రండి.... అవినీతి రహిత సమాజం కోసం,పాలన లో పారదర్శకత,జవాబుదారీతనం కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం....మనం కట్టిన పన్నులు సక్రమంగా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేలా చేద్దాం.పారదర్శకత ద్వారానే అవినీతిని అరికట్టవచ్చు.
మీ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు
What's Your Reaction?






