మీడియా పై మోహన్‌బాబు ఆగ్రహం

హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 14, 2023 - 10:14
 0  87
మీడియా పై మోహన్‌బాబు ఆగ్రహం

మీడియాపై మోహన్‌బాబు ఆగ్రహం..లోగోలు లాక్కోండంటూ బౌన్సర్లకు ఆదేశం

హైదరాబాద్ :

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు షాద్ నగర్‌లో మీడియాపై కాసేపు చిందులు తొక్కారు.ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు..

అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్‌కు వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

'ఆ లోగోలు లాక్కొండయ్యా' అంటూ తన బౌన్సర్లకు సూచించారు. మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? అంటూ తన నోటికి పని చెప్పారు. సీనియర్ నటుడైన మోహన్ బాబు తన ఆస్తికి సంబంధించి వీలునామా కోసం వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది.అయితే ఈ వ్యవహారం మీడియా దృష్టి పడకుండా ఆయన వ్యవహరించడంతో అక్కడ ఉన్నవారు ఏం జరుగుతుందోనని చూస్తూ ఉండిపోయారు.మీడియాపై చిందులు తొక్కిన వ్యవహారం, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు రాద్ధాంతం అయింది..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow