మహాత్మా గాంధీ నాడు నాటిన మొక్క.. నేడు మహా వృక్షం
ఆముదాలవలస స్టూడియో భారత్ ప్రతినిధి
మహాత్మా గాంధీ నాడు నాటిన మొక్క.. నేడు మహా వృక్షం
ఆముదాలవలస :
1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మహాత్మా గాంధీ దేశమంతా తానే స్వయంగా యాత్ర సాగించారు.ఆ యాత్ర లో భాగంగా ఆమదాలవలస మండలంలో దూసి రైల్వేస్టేషన్ కు మహాత్మా గాంధీజీ 1942లో చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్లో స్వాతంత్ర్య సమరయోధులతో కాసేపు స్వాతంత్య్ర కాంక్ష పై గాంధీ మాట్లాడారు.అనంతరం ఒక మర్రి మొక్కను నాటారు.నేడు అది మహావృక్షంగా మారింది.ఈ వృక్షానికి నేడు 82 ఏళ్లు వయసైందని దూసి గ్రామస్థులు చెబుతూ ఇప్పటికీ ఆ వృక్షాన్ని చూస్తే మహాత్మా గాంధీజీనే గుర్తుకు వస్తారని తెలిపారు.
What's Your Reaction?