సేతురామమల్ విద్యా మందిర్ స్కూల్ పై చర్యలు తీసుకున్న మండల విద్యాశాఖాధికారి
ధర్మవరపాడు తండా స్టూడియో భారత్ ప్రతినిధి
శ్రీమతి సేతురామమల్ విద్యా మందిర్ స్కూల్ పై చర్యలు తీసుకున్న మండల విద్యాశాఖాధికారి చిట్టిబాబు
ధర్మవరపాడు తండా
యన్.టి.ఆర్ జిల్లా,జగ్గయ్యపేట మండలం,ధర్మవరపాడు తండా,రాంకో సిమెంట్ కర్మాగారంలో గల శ్రీమతి సేతురామమల్ విద్యా మందిర్ స్కూల్ యాజమాన్యం వారు గాంధీ జయంతి నేషనల్ పబ్లిక్ హాలిడే సందర్భంగా స్కూల్ తెరచి విద్యను బోధిస్తున్నారని సమాచారం మేరకు ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కరిసే మధు పరిశీలించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక మండల విద్యాశాఖాధికారి యల్.చిట్టిబాబు హుటాహుటిన స్కూల్ ని పరిశీలించగా విద్యార్థులకు అట్టెండెన్స్ లేకుండా సుమారు 940 మంది విద్యార్థులకు విద్యను బోధించడం జరుగుతుందని గమనించిన యంఇఓ యల్.చిట్టిబాబు శ్రీమతి సేతురామమల్ విద్యా మందిర్ స్కూల్ యాజమాన్యం పై విద్యా హక్కు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఈ సందర్భంగా వీరి పై ఉన్నతాధికారుల ఆదేశాల సారంగా లక్ష రూపాయల పైబడి జరిమానాని విధించే అవకాశం ఉందని ఆయన మీడియాకు తెలియజేసారు.జగ్గయ్యపేట మండలంలో ఎవ్వరైన సరే ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వారు ప్రభుత్వ పబ్లిక్ హాలిడే లలో స్కూల్స్ తెరిచినచో తప్పకుండా విద్యా హక్కు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయుల ఫెడరేషన్ యన్.టి.ఆర్ జిల్లా అధ్యక్షులు కరిసే మధు మాట్లాడుతూ పబ్లిక్ హాలిడేలో ప్రైవేటు పాఠశాలు,కళాశాలు తెరిచి అధ్యాపకులు,ఉపాధ్యాయుల,విద్యార్థులకు సెలవులను కాల రాస్తే విద్యా హక్కు చట్ట ప్రకారం సహించేది లేదని ఆయన అన్నారు.ప్రైవేటు కళాశాల,పాఠశాల యాజమాన్యం వారు అధ్యాపకుల,ఉపాధ్యాయులకు పబ్లిక్ హాలిడే కి సహకరించాలని ఆయన కోరారు.
What's Your Reaction?