118 వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
118 వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది
జగ్గయ్యపేట
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిర్భావించి 118వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గయ్యపేట పట్టణం కోదాడ రోడ్డులో గల జగ్గయ్యపేట బ్రాంచ్ లో సిబ్బంది మరియు కస్టమర్లతో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.బ్రాంచ్ ని బెలూన్ తో సుందరంగా అలంకరించారు.ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ వేల్పుల ముత్తేశ్వరరావు మాట్లాడుతూ బ్రాంచ్ లోని కస్టమర్లకు సేవింగ్స్, కరెంట్ అక్కౌంట్, ఫిక్సడ్ డిపాజిట్ల పొదుపు ఖాతాదారులకు మరింత చేయూతనిస్తుందని ఆయన అన్నారు.
జగ్గయ్యపేట బ్రాంచ్ నుండి వ్యవసాయ రుణాలు,ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణాలు,విద్యా,వ్యాపార,గోల్డ్,గృహ,వాహన,వ్యక్తిగత రుణాలను అర్హతను బట్టి అందించడం వారి నుండి జమచేయించడం జరుగుతుందని,ఇప్పటికే బ్రాంచ్ అభివృద్ధిలో సుమారు 10 వేల మందికి పైగా ఖాతాదారులుకు బ్యాంకు సేవలను అందిస్తోందని ఆయన తెలియజేశారు.బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు అందించడంలో దేశంలో గల బ్యాంకింగ్ రంగంలో ముందు భాగాన్న నిలబడుతుందన్న ఉన్నత అధికారులకు,కస్టమర్లకు, బ్యాంకు సిబ్బంది కి ఆయన అభినందనలు తెలియజేశారు.
What's Your Reaction?