ఆశా వర్కర్‌లకు కేటీఆర్ భరోసా అధైర్యపడొద్దు అండగా నేనున్నా..
హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి
ఆశా వర్కర్‌లకు కేటీఆర్ భరోసా అధైర్యపడొద్దు అండగా నేనున్నా..
ఆశా వర్కర్లపట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు.మంగళవారం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిన ఆయన..సోమవారం పోలీసుల దాడిలో గాయపడిన ఆశావర్కర్లను పరామర్శించారు.అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేసిన ఆశావర్కర్లపై పోలీసులు దౌర్జన్యం చేశారని అన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ఆశావర్కర్ల పట్ల సోమవారం ఒక దుశ్శాసన పర్వమే కొనసాగిందని మండిపడ్డారు.కనీసం మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకొని వెళ్తారా..?అని కేటీఆర్ ప్రశ్నించారు.
హాట్ న్యూస్ ని చదవండి:- ఘనంగా ప్రారంభమైన రెడ్ షర్ట్ వాలంటీర్స్ జన సేవాదళ్ శిక్షణలు - https://studiobharat.com/Red-Shirt-Volunteers-Jana-Seva-Dal-Trainings
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో ఆశా వర్కర్ల వేతనాలను రూ.18 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని,ఇప్పుడు ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో వారు కోఠిలోని కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపితే దౌర్జన్యం చేశారని విమర్శించారు.రేవంత్ రెడ్డి సర్కారు చేసిన దుశ్శాసన పర్వాన్ని తెలంగాణ ఆడబిడ్డలు మరిచిపోరని అన్నారు.మీరందరూ ధైర్యంగా ఉండండి.
What's Your Reaction?