ఘనంగా ప్రారంభమైన రెడ్ షర్ట్ వాలంటీర్స్ జన సేవాదళ్ శిక్షణలు

నందిగామ స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 11, 2024 - 02:50
 0  27
ఘనంగా ప్రారంభమైన రెడ్ షర్ట్ వాలంటీర్స్ జన సేవాదళ్ శిక్షణలు

ఘనంగా ప్రారంభమైన రెడ్ షర్ట్ వాలంటీర్స్ జన సేవాదళ్ శిక్షణలు..

రెడ్ షర్ట్ వాలంటీర్స్ జన సేవాదళ్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన...సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు

రెడ్ షర్ట్ సేవాదళ్ శిక్షణ పతాకావిష్కరణ నా అదృష్టం... ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్

నందిగామ :-

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతజయంతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రెడ్ షర్ట్ వాలంటీర్స్ జన సేవాదళ్ శిక్షణా శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు.ముందుగా నందిగామ ఓసి క్లబ్ నందు శిక్షణ శిబిర ప్రారంభ సూచక గా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పతాకాన్ని ఆవిష్కరించగా అక్కడ నుండి నందిగామ అయ్యదేవర కాలేశ్వర ప్రాంగణానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు.జన సేవాదళ్ శిక్షణ శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రతాకావిష్కరణ తో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ సుదీర్ఘ ఉద్యమాల పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతజయంతోత్సవాల సందర్భంగా నిర్వహించ తలపెట్టిన జన సేవదళ్ కార్యక్రమం గురించి వివరించారు.ఈనెల 20 వ తారీఖున సిపిఐ పార్టీ 100వ జయంతోత్సవాల నిర్వహణలో భాగంగా ప్రజా పోరాటాలను ముమ్మరం చేస్తూ కార్మికకర్షక సమస్యలను ఎదుర్కొంటూ డిసెంబర్ 26 వ తేదీ నాటికి 99 సంవత్సరాలు నుండి 100 వ సంవత్సరంలో అడు గెడుతున్న సందర్భంలో జరుగుతున్న ఉత్సవాలనుగా ఘనంగా నిర్వహించుకోవాలన్నారు.

బ్రిటిష్ వారి నుండి దేశ రక్షణ కొరకు ఎన్నో పోరాటాలు చేసిన భారతీయ కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్రం లభించిన తర్వాత భూస్వాముల నుండి పేదలకు రక్షణ కల్పిస్తూ ఎన్నో భూ ఉద్యమాలు చేసి ప్రజలకు అండగా నిలిచిన పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీగా పేర్కొన్నారు.రాజా భవనాలు రద్దు కొరకై పెద్ద సంఖ్యలో ఢిల్లీలో లక్షల మందితో ర్యాలీ చేసి రాజా భవనాల రద్దు చేయించటం జరిగిందని పేర్కొన్నారు.ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలలో సైద్యాంతిక అంకిత భావంతో శిక్షణ పొందితే సమాజంలో ముందు భాగంలో నిలబడే అవకాశం ఉంటుందని,ఐదు రోజులపాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు అంకితభావంతో శిక్షణ పొందాలని పేర్కొన్నారు.

ఏక కాలంలో విజృంభిస్తున్న రెండు ప్రాణాంతకం వ్యాధులు - WHO - https://studiobharat.com/Two-deadly-diseases-that-are-booming-at-the-same-time

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడే క్కడి నుండో వచ్చిన వివిధ వర్గాల వారు ఈ ఐదు రోజులపాటు ప్రతిక్షణం జన సేవధల్ అధ్యక్షులుగా ఎవరు ఉంటే వారు తీసుకునే నిర్ణయాలే ఫైనల్ గా ఉంటాయని,వాటి ద్వారా ప్రతి ఒక్క శిక్షణ పొందే కమ్యూనిస్టు ప్రతినిధి నడుచుకోవాలని కోరారు.అకుంఠిత దృష్టితో ఈ శిక్షణ తీసుకుంటే సమాజంలో జరిగే ఎన్నో దుర్ఘతల నుండి సిపిఐ జన సేవాదళ్ ప్రతినిధి ఎదురెొడ్డి నిలబడే సత్తా ఉంటుందని పేర్కొన్నారు.శత జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కామ్రేడ్స్ కు అనేక రకాల శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని,ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ తరగతులలో పాల్గొని భారతీయ కమ్యూనిస్టు పార్టీని మరింత బలపరచాలని కోరారు.

కమ్యూనిస్టు ముద్దుబిడ్డ సిపిఐ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ దివంగత సూర్యదేవర నాగేశ్వరరావు పుట్టిన గడ్డపై సిపిఐ రెడ్ షర్ట్ జన సేవాదళ్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ పార్టీ శతజయంతోత్సవాల సందర్భంలో తలపెట్టిన జన సేవాదళ్ శిక్షణ శిబిరాన్ని నా సమక్షంలో నందిగామ లో నిర్వహించటం,తనచే ప్రతాకావిష్కరణ చేయటం వారి అదృష్టంగా భావిస్తున్నానన్నారు.ఈ శిబిరంకు ఒక ప్రత్యేకతను సంతరించుకుందని,దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదనీ అన్నారు.100 సంవత్సరాల చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు.

ఎన్నో ఉద్యమాలు నిర్వహించి ఎందరినో ఎదుర్కొడ్డి ఎన్నో ఉద్యమాలను సాధించిన ఘనత భారతీయ కమ్యూనిస్టు పార్టీదే అన్నారు.ఉద్యమాలా సాధనలో రక్తం చిందించి నటువంటి చరిత్ర ఏ దేశంలో ఏ పార్టీకైనా ఉన్నదంటే,అది ఒక భారత కమ్యూనిస్టు పార్టీ కి మాత్రమే ఉందని సగర్వంగా తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.శిక్షణ పొందే ప్రతి ఒక్కరు కి ఉద్యమ స్ఫూర్తితో రెడ్ సెల్యూట్ చెప్పారు.ఈ క్యాంపులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ అమరవీరుల స్ఫూర్తిని ఆవహింప చేసుకునీ,ఉద్యమ వీరుల లాగా ఎవరికోసమైతే వారు తమ జీవితాన్ని త్యాగాలు చేశారో,ఏ ప్రజల కోసమే తన జీవితాన్ని అంగీతం చేశారో,ఇక్కడ వచ్చిన వారికి ట్రైనింగ్స్ ఇవ్వటం ద్వారా జన సేవధల్ మరింత బలపడుతుందన్నారు.

ఇటీవల జరిగిన పకృతి విలయతాండవం చేసి ప్రజలను అతలాకుతలం చేసిన సమయంలో భారీ తుఫానుల సంతరించుకున్న సమయంలో ఉదాహరణకు ఇటీవల విజయవాడ,నందిగామ,జగ్గయ్యపేట లు మునిగిపోయింది.కానీ అనేకమంది కార్యకర్తలు సంఘటితంగా ఏర్పడి భగత్ సింగ్ ఫాలోయర్స్ అని ఎన్నో సహాయ సహకార కార్యక్రమాలు నిర్వహించిన ఘనత భారత కమ్యూనిస్టు సిద్ధాంతకుల దేనని అన్నారు.యూత్ ఫెడరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి కూడా,అదే సందర్భంలో శతజయంతి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా జరిగేటువంటి జన సేవదల్ క్యాంపులో పతాకావిష్కరణ చేయటం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్ననని ఆయన అన్నారు.

ఎర్రజెండా త్యాగాల బిడ్డగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీకి యూత్ ఫెడరేషన్ బాధ్యులకు,విద్యార్థి దశ నుండే బాధ్యతలను స్వీకరించే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ,వారికి చక్కటి ఏర్పాట్లు చేసామని,మంచి భోజనం, మంచి వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని,ఎన్సిసి క్యాటగిరి అయితే జాతి కోసం దేశం కోసం భారతీయ సమర్థత కోసం అశ్రులు బాసిన అమర వీరులందరికి భగత్ సింగ్ లాంటి యోధులందరికీ కూడా త్యాగాలు వాళ్ళకి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అందరికి కార్వియక్రమం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కామ్రేడ్స్ నాల్ల వెంకటేశ్వరరావు,ఫెయ్యాల వెంకటేశ్వరరావు,నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు వెంకట సుబ్బారావు,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్చూరి రాజేంద్ర బాబు,కార్యదర్శి లెనిన్ బాబు,దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గుట్టి రాయప్ప,సంగుల పేరయ్య,ఏ ఐ ఏస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ,మాజీ అధ్యక్షుడు జాన్సన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow