రాబోయే వేసవి నీటి ఎద్దడికి ప్రత్యామ్నాయ మార్గాలు - ఆర్.డబ్ల్యు.యస్ ఎఇ యస్.శ్రీనివాసరావు
జగ్గయ్యపేట స్టూడియో భారత్

రాబోయే వేసవి నీటి ఎద్దడికి ప్రత్యామ్నాయ మార్గాలు - ఆర్.డబ్ల్యు.యస్ ఎఇ యస్.శ్రీనివాసరావు
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ(ఆర్.డబ్ల్యు.యస్) జగ్గయ్యపేట మండలం లో 19 గ్రామాలు,వత్సవాయి మండలంలో 24 గ్రామాలుగా సుమారు 43 గ్రామాలకు నీటిని కాంప్ర హెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లయి స్కీం (సిపిడబ్ల్యుయస్) క్రింద రక్షిత త్రాగునీరు ని అందిస్తున్నారు.ఈ స్కీం క్రింద 8 ప్రాజెక్ట్ గా సుమారు 6 లక్షల 70 వేల లీటర్ల సామర్థ్యంతో త్రాగునీరుగా గ్రామాలకు అందిస్తున్నారు.ప్రస్తుతం ఒక్కొక్క మనిషికి రోజుకి 40 లీటర్ల నీటిని అందిస్తున్నామని,ఆ లెక్క ప్రకారం సుమారు 1 లక్ష 25 వేల పాపులేషన్ కి రోజుకి 50 లక్షల లీటర్ పెర్ క్యాపిటాపెర్ డే(యల్.పి.సి.డి) గా సురక్షిత త్రాగునీరుని అందిస్తున్నామని ఆర్.డబ్లు.యస్ ఎఇ యస్.శ్రీనివాసరావు మీడియాకు తెలియజేసారు.
ఇప్పటికే పాలేరు,మున్నేరు లో లెవల్ కి మించి ఇసుకను తోడటం మూలానా రాబోయే వేసవి నాటికి అనగా మార్చి నెల నుండే ఈ స్కీం ద్వారా రక్షిత నీటి సరఫరా కి అంతరాయం ఏర్పడబోతుందని ఆయన తెలియజేశారు.దీనికి స్థానిక శాసన సభ్యులు సామినేని ఉదయభాను కృషి తో యంపి కేశినేని నాని(శ్రీనివాసరావు) గారి యంపి లాడ్స్ నిధుల సహాయ సహకారాలతో సుమారు 40 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి ఆయా పంచాయతీలకు అప్పగించడం జరిగిందని ఆర్.డబ్ల్యు.యస్ ఎఇ యస్ శ్రీనివాసరావు తెలియపరిచారు.
ఇప్పటికే రెండు,మూడు చెక్ డ్యాంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్నికి ప్రపోషల్స్ ద్వారా సిఫార్సు చేసినట్లు ఆయన తెలియజేశారు.రాబోయే వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నుండి ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం ప్రతి ఒక్కరు భూగర్భ జలాలు పెంచడానికి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంటలను తపని సరిగ ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలియజేశారు.
What's Your Reaction?






