జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే- ఐక్యరాజ్యసమితి

వరల్డ్ స్టూడియో భారత్ ప్రతినిధి

Feb 17, 2024 - 04:57
 0  57
జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే- ఐక్యరాజ్యసమితి

ప్రపంచంలోనీ ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే ఐక్యరాజ్యసమితి

గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది.యునెస్కో అంచనాల ప్రకారం కేవలం పదికి ఒక కేసులో మాత్రమే ఈ నేరాలకు బాధ్యులు చట్టం ముందు విచారణను ఎదుర్కొంటున్నారు.

అంతర్జాతీయ చట్టం,ఇతర ఒప్పందాల ప్రకారం జర్నలిస్టులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను పూర్తిగా విచారించి బాధ్యులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవడంలో దేశాలు భయంకరమైన వైఫల్యాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.అంతర్జాతీయ చట్టం ప్రకారం జర్నలిస్టులపై జరిగిన దాడులపై తక్షణమే,పూర్తిగా,స్వతంత్రంగా దర్యాప్తు చేయడం,బాధ్యులను విచారించడం ప్రభుత్వాల బాధ్యత.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow