రాంకో వారి సౌజన్యంతో దోబి ఘాట్ నిర్మాణం
కె.అగ్రహారం స్టూడియో భారత్
రాంకో వారి సౌజన్యంతో దోబి ఘాట్ నిర్మాణం
కె.అగ్రహారం
జగ్గయ్యపేట మండలం,కౌతవారి అగ్రహారం గ్రామ పంచాయతీ పరిధిలో పాలేరు ఒడ్డున ప్రభుత్వ విప్,స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను వారి కృషితో,రాంకో సిమెంట్ కంపెనీ వారి ఆర్థిక సహకారంతో గ్రామ ప్రజలు,రజకుల కోసం దోబి ఘాట్ ను నిర్మించడం జరుగుతుంది.
గ్రామ ప్రజలు మరియు రజకులు విడిచిన బట్టలను ఉత్తుకోవడానికి పాలేరు ఒడ్డుకు వచ్చే ఆనవాయితీ ఉందని సర్పంచ్ ఆవుల శ్రీనివాసరావు తెలియజేసారు.దీనితో దోబి ఘాట్ ప్రజలకు,రజకులకు అవసరాన్ని గుర్తించి ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను వారిని గ్రామానికి కావాల్సి ఉందని కోరటం జరిగింది.వెంటనే స్పందించి రాంకో సిమెంట్ కంపెనీ వారిని ఆయన ప్రజా అవసరం కోసం దోబి ఘాట్ ను నిర్మించాలని తెలియజేసారు.
రాంకో సిమెంట్ కంపెనీ వారు స్పందించి ప్రజా అవసరం కోసం దోబి ఘాట్ నిర్మాణానికి ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తున్నారని సర్పంచ్ ఆవుల శ్రీనివాసరావు మీడియాకి తెలియజేసారు.దీనితో కౌతవారి అగ్రహారం గ్రామ పాలేరు ఒడ్డున మూడు ఘాటలతో సుమారు నలభై ఖానాలతో,పది లక్షల రూపాయల వ్యయాని వెచ్చించి దోబి ఘాట్ ను నిర్మణం చేయడం జరుగుతుందని సర్పంచ్ ఆవుల శ్రీనివాసరావు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ముల్లగిరి కుమారి,తాపి మేస్త్రి పరిమి రాములు పాల్గొన్నారు.
What's Your Reaction?