ప్రజాస్వామ్యంలో ఎవ్వరు గెలిచిన ప్రజా సమస్యలే సిపిఐ ఎజెండా - సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
ప్రజాస్వామ్యంలో ఎవ్వరు గెలిచిన ప్రజా సమస్యలే సిపిఐ ఎజెండా - సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట సిపిఐ పట్టణ కార్యలయం లో సిపిఐ పట్టణ కార్యదర్శి,ప్రముఖ న్యాయవాది జూనెబోయిన శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో,జగ్గయ్యపేట ప్రాంతంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన సిపిఐ పార్టీ ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు,వాటి పరిష్కారంపై నిరంతర అలుపెరుగని పోరాటాలను చేస్తుంటుందని ఆయన తెలియజేశారు.జగ్గయ్యపేట ప్రాంతంలో ఇప్పుటికే దీర్ఘకాలిక పరిష్కారానికి నోచుకోని సమస్యలున్నాయి.వాటిలో కాలుష్యం నివారణపై చర్యలు తీసుకోవాలి.స్థానిక కర్మాగారాలలో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి.స్లంలో ప్రతి ఏరియాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి.
ప్రతి గ్రామానికి కృష్ణా వాటర్ ని త్రాగునీరుగా అందించాలి.ప్రభుత్వ ఇంటర్,డిప్లొమా మరియు లా,డిగ్రీ, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రామా కేర్ సౌకర్యం కల్పించాలి.ఈయస్ఐ హాస్పిటల్ కి శాశ్వత భవన ఏర్పాటు చేయాలి.స్వర్ణకార చేతి వృత్తులకు ప్రతి రోజు పని కల్పించాలి,పట్టణంలో పార్కింగ్ ఏరియాని కేటాయించాలి.భవన నిర్మాణ కార్మికులకు పని కల్ఫించే విషయంలో ఉచిత ఇసుకను అందించాలి.ప్యాసింజర్ రైలు సౌకర్యం ఏర్పాటు చేయాలి.ప్రతి పల్లెకు ఆర్.టి.సి బస్సు సౌకర్యం కల్పించాలి.తెలంగాణ మరియు దూర ప్రాంతాలకు ఏసి బస్సు సౌకర్యం కల్పించాలి.పోలంపల్లి డ్యాంను పూర్తి చేయాలి.
లింగాల,అగ్రహారం బ్రిడ్జీలను ఎత్తు లేపి నూతనంగా ఏర్పాటు చేయాలి.విశాఖ స్టీల్ ప్లాంట్ కి మైనింగ్ అనుమతులు ఇవ్వాలి.ప్రసిద్ద దేవాలయాలు మరియు బౌద్ధ స్థూపం దృష్టి లో పెట్టుకొని ఈ ప్రాంతాని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.మార్కెట్ యార్డు ద్వారా రైతుల పంటలను కొనుగోలు చేయాలి.ఆగిపోయిన టిట్కో ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి.ఎండోమెంట్ ల్యాండ్ సమస్యలను పరిష్కరించి రిజిస్ట్రేషన్ ని పునఃప్రారంభించాలి.
ప్రభుత్వ స్థలాలలో ఉంటున్న వారికి శాశ్వత పట్టాలను మంజూరు చేయాలి.పై సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో, జగ్గయ్యపేట ప్రాంతంలో ఎవ్వరు గెలిచిన ప్రజల పక్షాన సిపిఐ నిరంతరం పరిష్కారానికి పోరాలను ఉదృతం చేస్తామని ఆయన తెలియజేశారు.గెలిచాకా ఏ పార్టీ నాయకులైన రాజకీయ కక్ష్య సాధింపు చర్యలను మానుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు హితవు పలికారు.
__మీకు తెలుసా!..దయచేసి చదవండి... బ్యాంక్‌లో రైతు తాకట్టు పెట్టిన బంగారం మాయం .....
https://studiobharat.com/The-gold-pledged-by-the-farmer-in-the-bank-is-lost ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..
What's Your Reaction?