అల్ట్రా టెక్ ప్రమాదంలో యాభై శాతం కాలిన వారికి కూడా కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి - దోనెపూడి శంకర్ 

బూదవాడ స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 10, 2024 - 06:36
 0  106
అల్ట్రా టెక్ ప్రమాదంలో యాభై శాతం కాలిన వారికి కూడా కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి - దోనెపూడి శంకర్ 

అల్ట్రా టెక్ ప్రమాదంలో యాభై శాతం కాలిపోయిన కుటుంబాల వారికి కూడా కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి - దోనెపూడి శంకర్ 

జగ్గయ్యపేట 

యన్.టి.ఆర్ జిల్లా,జగ్గయ్యపేట మండలం,బూదవాడ గ్రామం ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం ఘటనలో క్షతగాత్రుల కుటుంబాలను సిపిఐ యన్.టి.ఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ బృందం ఇంటికి వెళ్ళి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలి 16 మంది కార్మికులకు ప్రమాదం జరిగింది.ఈ సంఘటనలో ఆవుల వెంకటేష్ మృతి చెందారని,ఆరుగురు యాబై శాతం పైబడి శరీరం కాలి ప్రమాదపుట్టంచులలో చికిత్స తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

ఇప్పటికే అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారంలో మృతి ని కుటుంబానికి యాభై లక్షల రూపాయలు,యాభై శాతం పైబడి కాలిపోయిన వారికి పాతిక లక్షల రూపాయలు,మిగిలిన క్షతగాత్రులకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం అందించడానికి సిద్దపడిందని ఆయన అన్నారు.కాని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరణించిన కుటుంబానికి గాని,యాభై శాతం కాలిపోయిన వారికి గాని,కండ్లు పోయిన వారికి గాని, ప్రమాదంలోని క్షతగాత్రులకు ఏ ఒక్క రూపాయి నష్టపరిహారం ప్రకటించకపోవడం బాధాకరం అని ఆయన అన్నారు.

కాని రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిశ్రమల కర్మాగారాలలో పర్యవేక్షణ లోపభూయిష్టంగా ఉందని,అధికారులు మాముల మత్తులో జోగుటుండటమే ఈ ప్రమాదానికి కారణమని ఆయన విమర్శించారు.అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులకు యాజమాన్యం సేఫ్టీ ని అందించక పోవడంతోనే ఈ ప్రమాద ఘటనకి కారణమని ఆయన అన్నారు.దీనికి సంబంధిత కర్మాగారాలు,పొల్యూషన్ కంట్రోల్ శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాని కోరారు.

ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ తో జిల్లా కలెక్టర్ ఉన్నప్పటికి,ఘటన జరిగి మూడు రోజులు దాటుతున్న సంబంధిత శాఖా అధికారులు మాత్రం అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారం సంఘటనని విచారించి వాస్తవాలను అధికారికంగా చెప్పాల్సింది పోయి,ఆ విషయాని గాలికి వదిలేసి,ఇతర వాటి పై విచారించడమంటే సమస్యను అధికారులు ఏవిధంగా పక్కదారి పట్టిస్తున్నారో అర్థం అవుతుంది.ఇప్పటికైన అధికారులు మొద్దు నిద్ర వీడి అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారంలో జరిగిన ప్రమాదపు వాస్తవాలను అధికారికంగా బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరణించిన ఆవుల వెంకటేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని,యాభై శాతం పైబడి కాలిపోయిన,ప్రమాదంలో కళ్ళు,అంగవైకల్యానికి గురైన బాధితులకు అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారం యాభై లక్షలు,రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు,మిగిలిన భాదితులకు యాజమాన్యం పాతిక లక్షలు,ప్రభుత్వం పాతిక లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియాని ఇవ్వాలని,వారి కుటుంబంలో రెగ్యులర్ పోస్టులను కర్మాగారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ, సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ బాయిలర్ లీకు అవుతున్న విషయాన్ని కార్మికులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళామని,భద్రత చర్యలను విస్మరించారని,అందువల్లే ప్రమాదం జరిగిందని వారు విమర్శించారు.దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వారు అన్నారు. 

ఈ ప్రమాద ఘటనకి పూర్తి స్థాయిలో క్షతగాత్రుల కుటుంబాల వారికి ప్రభుత్వం,యాజమాన్యం న్యాయం చేసేంత వరకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి వర్గ సభ్యులు తాడి పైడియ్య,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు లంక గోవిందరాజులు,ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి పోతుపాక వెంకశ్వర్లు,సిపిఐ నాయకులు మెటికల శ్రీనివాసరావు,కరిసె మధు,ఏఐటియూసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow