బలగం నటుడు కన్నుమూత
సినిమా స్టూడియో భారత్ ప్రతినిధి

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం బలగం నటుడు కన్నుమూత
బలగం ..
పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణలోని పిట్ట ముట్టుడు సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కించారు. అయితే టాలీవుడ్‌లో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా బలగం.
వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.కాగా..ఈ సినిమాలో సర్పంచ్ పాత్రలో కనిపించిన నటుడు నర్సింగం కన్నుమూశారు.ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వేణు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.గత కొంతకాలంగా నర్సింగం రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు.పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు.ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బలగం దర్శకుడు వేణు నివాళులు అర్పించారు.
“నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి.
మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం.”అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న పలువురు చిత్ర బృందంలోని సభ్యులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
What's Your Reaction?






