మేము సిద్దం - మేము సంసిద్ధం అంటున్న జగ్గయ్యపేట యంఎల్ఏ అభ్యర్థులు

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

May 2, 2024 - 08:35
 0  200
మేము సిద్దం - మేము సంసిద్ధం అంటున్న జగ్గయ్యపేట యంఎల్ఏ అభ్యర్థులు

మేము సిద్దం - మేము సంసిద్ధం అంటున్న జగ్గయ్యపేట యంఎల్ఏ అభ్యర్థులు 

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట శాసనసభ ఎన్నికల బరిలో వైయస్ఆర్ పార్టీ నుండి సామినేని ఉదయభాను,తెలుగు దేశం పార్టీ నుండి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) యంయల్ఏ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసి పోటీలో ఉన్నారు.వీరితో పాటు సుమారు పదకొండు మంది పలు పార్టీ ల వారు,స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయడం జరిగింది.

ఈ ఎన్నికలలో ఎవ్వరితో పొత్తులు లేకుండా వైకాపా తరపున సామినేని ఉదయభాను కి,తెలుగు దేశం పార్టీ తరుపున బిజెపి,జనసేన పొత్తులతో ఉమ్మడిగా శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) లుగా ఎన్నికల బరిలో ఉన్నారు.వీరిలో యంఎల్ఏ గా గెలవడం వీరికి మరియు వీరి కార్యకర్తలకు ప్రతిష్టాత్మకంగా మారింది.దీనితో ఎవ్వరికి వారు బల బలాలను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తున్నారు.ఓట్ల కోసం వీరు ఓటర్లను ఆకర్షిస్తూ గెలుపు కోసం తగ్గేదెలే అన్నట్లుంది ఇరు పార్టీల వారు తీరు.

దీనితో ఎవ్వరితో పొత్తులు లేకుండా వైకాపా అభ్యర్థి ప్రస్తుత యంఎల్ఏ సామినేని ఉదయభాను సీనియర్ రాజకీయంలో అనుభవుడు.జగ్గయ్యపేట పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధి మేమే చేసామని,సామినేని అంటేనే అభివృద్ధి అంటున్నారు.జగ్గయ్యపేట చరిత్రని ప్రజల అభిమానంతో గెలిచి తిరగ వ్రాసామంటున్నారు.వైకాపా నవరత్నాల పథకాలు ఇంటింటికి రాజకీయాలకు అతీతంగా చేరవేయడంతో ప్రజల అభిమానాన్ని చొరగొన్నామంటున్నారు.బిసిలు,యస్.సి,యస్.టి లకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటున్నారు.

అందుకే ప్రజలు అభిమానంతో ఎన్నికలలో జగ్గయ్యపేట వైకాపా అభ్యర్థి సామినేని ఉదయభాను కి అఖండ మెజారిటితో యంఎల్ఏ గా గెలిపించి మరోసారి పట్టం కడతారంటున్నారు.ఎన్నికల పోటీ బరిలో వైకాపా పార్టీ గెలుపు కోసం మేము సిద్ధం అంటున్నారు.

బిజెపి,జనసేన,తెదేపా పార్టీల ఉమ్మడి తెదేపా అభ్యర్ధి మాజీ యంయల్ఏ శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) గతంలో తను చేసిన జగ్గయ్యపేట అభివృద్ధి గురించి,తాను చేస్తున్న ప్రజలకి చేస్తున్న సేవా భావాన్ని గురించి ,ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటున్నామాని వారు తెలియజేస్తున్నారు.జగ్గయ్యపేటలో అన్ని వర్గాల ప్రజలు మా వెంటే ఉన్నారంటున్నారు.వైకాపా అధికారంలో ఉండి రాష్ట్ర అభివృద్ధి చేయడంలో ప్రజలకి ఒరిగిందేమీ లేదని,వైకాపా వైఫల్యాలే తెదేపాను గెలుపిస్తుందని,ఆ దిశలో జగ్గయ్యపేట ఓటర్లు బిజెపి,జనసేన,తెదేపా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) గెలిపిస్తారని ధీమాతో ఎన్నికల బరిలో పోటీకి మేము సంసిద్ధమే అంటున్నారు.

రాజకీయ అనుభవం,ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్దించిన,జగ్గయ్యపేట అభివృద్ధి కి కృషి చేసిన వైకాపా పార్టీ అభ్యర్థి సామినేని ఉదయభాను ని జగ్గయ్యపేట నియోజకవర్గ ఓటర్లు ఓటు వేసి గెలిపించేనా?

లేక గతం నుండి జగ్గయ్యపేట అభివృద్ధి మా వల్లే,ప్రజా సేవ చేస్తున్న తెలుగు దేశం పార్టీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) ని జగ్గయ్యపేట నియోజకవర్గ ఓటర్లు ఓటు వేసి గెలిపించేనా?

ఏది ఏమైనా రాష్ట్ర,స్థానిక ప్రజలు జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ ఎన్నికలు ఏమి జరుగుతోందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి జగ్గయ్యపేట ఓటర్ల మహాశయులు వీరిలో యంఎల్ఏ గా పట్టం కడతారో మరి కొన్ని రోజులలో వేచి చూడాల్సిందే.మీ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow