అయ్యో మళ్ళీ నిరాశే..!!
న్యూఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి

లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది.ఈ నెల 6కి న్యాయమూర్తి వాయిదా వేశారు.కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా వాయిదా వేశారు.అయితే కవిత బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..రౌస్ అవెన్యూ కోర్టు నేడు తీర్పును రిజర్వ్ చేసింది.ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.
What's Your Reaction?






