పియం కిసాన్ యాప్ లో ఫేస్ ఆథెన్టికేషన్ ఇక ఇబ్బందులు లేవు

డిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 1, 2023 - 12:15
 0  42
పియం కిసాన్ యాప్ లో ఫేస్ ఆథెన్టికేషన్ ఇక ఇబ్బందులు లేవు

రైతన్నలకు శుభవార్త: ప్రధాన మంత్రి కిసాన్ యాప్ లో ఫేస్ ఆథెన్టికేషన్ ఇక ఇబ్బందులు లేవు

ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం పియం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రూపంలో పొలం ఉన్న రైతులందరికీ ప్రతి సంవత్సరం కనీస మద్దతు ఆర్ధిక సాహయాన్ని అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఇటువంటి పథకంలో ఒక్కొక్క రైతుకు రూపాయలను మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి 6వేలు నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాలకి జమచేయబడతాయి.దీనివల్ల ఎనిమిది కోట్ల మంది అర్హులైన లక్షలాది రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.16వేల కోట్లు పంపిణీ చేసింది.దీని ద్వారా అర్హత కలిగిన వారందరికి సులబంగా లబ్ధి అందించేలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇప్పటి నేపథ్యంలో పియం-కిసాన్ యాప్‌ లో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను ప్రస్తుతం విడుదల చేసింది.ప్రభుత్వ పథకాలలో ఫేస్‌ అథెంటికేషన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్న మొట మొదటి కేంద్ర సంక్షేమ కార్యక్రమంగా పియం కిసాన్‌ నిలుస్తుంది.

ప్రస్తుతం లబ్ధిదారులైన రైతులు పియం కిసాన్,తమ మొబైల్ యాప్ డివైజ్‌లలో ఫేస్ ను స్కాన్ చేయడం ద్వారా ఈజీగా e-KYC ప్రాసెస్‌ని కంప్లీట్‌ చేసుకోవచ్చు.వృద్ధులకు ప్రాసెస్‌ను సులభతరం చేసే లక్ష్యంతో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.ఇక పై ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ ఎలా పని చేస్తుందంటే రైతులు వాడే మొబైల్ ఫోన్లలో ఫేస్ స్కానింగ్‌ సాయంతో E KYC ప్రాసెస్‌ కంప్లీట్‌ చేయవచ్చు.మొబైల్ నంబర్లను తమ ఆధార్ కార్డ్‌లకు లింక్ చేయని వృద్ధ రైతులకు ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా మార బోతుంది.

పియం లబ్ధిదారులందరికీ యాక్సెసబిలిటీ, కన్వీనియన్స్‌ అందిస్తుంది.గతంలో పియం-కిసాన్ లబ్ధిదారులు బయో మెట్రిక్ వెరిఫికేషన్‌ లేదా వారి రిజిస్డర్డ్‌ మొబైల్ నంబర్లకు పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్‌ ద్వారా ఈ కెవైసి చేయించుకోవాల్సి ఉండేది.ఆధార్‌తో లింక్‌ కాని మొబైల్‌ నంబర్లు, వెరిఫికేషన్‌ సెంటర్లకు చేరుకోవడంలో ఇబ్బందులు రైతులకు సమస్యగా ఉండేది.ఇపుడు ఈ ఫేస్ అథెంటికేషన్‌ ఇలాంటి అడ్డంకులను తొలగించుతుంది.

ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్ లలో రైతుల ఆధార్ కార్డుల నుంచి ఐరిస్ డేటాను ఉపయోగించుకుంటుంది.దీనితో పాటు పియం-కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్‌ మున్ముందు దీని గురించి ఇంకా ఎవరికి తెలియకపోతే దానిని మీ చుట్టూ పక్కల గల రైతులకు సవివరంగా తెలియజేయగలరు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow