సెంచరీ దాటేసిన పచ్చిమిర్చి టమాట....
పెరిగిన ధరలతో సామాన్యుడు బతికేదెలా.... ఏపీ స్టూడియో భారత్ ప్రతినిధి

సెంచరీ దాటేసిన పచ్చిమిర్చి టమాట.. పెరిగిన ధరలతో సామాన్యుడు బతికేదెలా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమాటా,పచ్చిమిర్చి సెంచరీ దాటేసాయి.సామాన్యులకు ఎల్లప్పుడూ సరసమైన ధరలు అందుబాటులో ఉంటే టమాట పచ్చిమిర్చి ధరలు ప్రస్తుతం కొండెక్కాయి.ప్రస్తుతం టమాట ధర కేజీ 120 రూపాయలు కాగా పచ్చిమిర్చి 150 రూపాయలకు పైగే ధర పలుకుతుంది.పూర్వం టమాట పచ్చిమిరపకాలతో పచ్చడి దంచుకొని వేడివేడి అన్నంలో కలుపుతూనే పేద కుటుంబాలు ఎన్నో ఉండేవి.
నేటికీ కూడా పేద,మధ్య తరగతి కుటుంబాలకు నిత్యవసర కూరగాయలుగా టమాటా పచ్చిమిర్చి ఎల్లప్పుడూ ఇంటిలో ఉంచుకొని వంటకాలు చేసుకుంటూ ఉంటారు.అలాంటిది ఇప్పుడు ధనికులు మాత్రమే కొనే స్థితిలోకి పచ్చిమిర్చి టమాట ధరలు వెళ్లిపోయాయి.మరి ప్రజా పాలకులు పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల,కూరగాయల ధరలు నియంత్రణలో ఉంచుతారో లేదో మరికొంత కాలం వేచి చూడక తప్పదు..
What's Your Reaction?






